Advertisementt

ఈ అందమైన యాంకర్.. నితిన్ విలనా?

Thu 27th Feb 2020 08:48 PM
ancor anasuya,villain,nithiin,andhadhun,remake,tollywood  ఈ అందమైన యాంకర్.. నితిన్ విలనా?
Beautiful Ancor Anasuya Villain in Nithiin Andhadhun Remake ఈ అందమైన యాంకర్.. నితిన్ విలనా?
Advertisement
Ads by CJ

అనసూయ బుల్లితెర మహారాణి. స్టేజ్ ఏదైనా.. ఆ అందం మాత్రం నాదే అన్న రేంజ్ లో అనసూయ అందాల ఆరబోత ఉంటుంది. పిల్లల తల్లిలా కాదు.. హాట్ హీరోయిన్స్ కి గట్టిపోటి ఇచ్చే అందంతో అనసూయ ఎగసి పడుతుంది. జబర్దస్త్ స్టేజ్ అయినా, లోకల్ గ్యాంగ్స్ స్టేజ్ అయినా అనసూయ అందాలను వర్ణించడం అసాధ్యం అన్న రీతిలో ఆమె అందం ఉంది. తాజాగా జెమిని టివిలో సరికొత్త గేమ్ షోలో అనసూయ యాంకరింగ్ మొదలు కాబోతుంది. జస్ట్ ప్రోమోలోనే అనసూయ హాట్ నెస్ ని చూపించి వదిలారు. తల్లా.. పెళ్ళామా అంటూ అనసూయ చూపిస్తున్న అందాలు కేకో కేక. పొట్టి డ్రెస్ లో అనసూయ అబ్బా అదిరింది. మరి ఇంత అందంతో ఇప్పుడు వెండితెర మీద దర్శకులు విలనిజాన్ని పండించాలనుకుంటున్నారు.

సుకుమార్ - అల్లు అర్జున్ సినిమాలో అనసూయ నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ చేస్తుంది అనే న్యూస్ ఉంది. ఇక కొరటాల - చిరు మూవీలో, కృష్ణవంశీ రంగమార్తాండలో అనసూయ కీ రోల్స్ చేస్తుంటే.. తాజాగా నితిన్ కోసం అనసూయ విలన్ అవతారమెత్తబోతుంది అని.. నితిన్ అంధాదున్ రీమేక్ లో బోల్డ్ కేరెక్టర్ కి అనసూయ అయితే కరెక్ట్ అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ అంధాదున్ సినిమాని నితిన్ తెలుగులో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రీమేక్ కి శ్రీకారం చుట్టాడు. బాలీవుడ్ లో బోల్డ్ కేరెక్టర్ లో టబు నటిస్తే.. ఇప్పుడు తెలుగులో ఆ కేరెక్టర్ ని అనసూయ చేస్తే బావుంటుంది అనే ప్రపోజల్ ని దర్శకనిర్మాతల వద్ద ఉంచినట్టుగా సమాచారం. మరి అందమైన భామని అందమైన విలన్ గా చూయించడానికి దర్శకులు తహతహలాడుతున్నారన్నమాట.

Beautiful Ancor Anasuya Villain in Nithiin Andhadhun Remake:

Ancor Anasuya VS Hero Nithiin

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ