Advertisementt

నయన్ అందుబాటులోకి వచ్చినట్లే!

Thu 27th Feb 2020 08:40 PM
nayanthara,remuneration,dicrese,producer,movies,tollywood  నయన్ అందుబాటులోకి వచ్చినట్లే!
Nayanthara Available for All Producers నయన్ అందుబాటులోకి వచ్చినట్లే!
Advertisement
Ads by CJ

కోలీవుడ్ లో అత్యధిక పారితోషకం తీసుకునే హీరోయిన్స్ లో నయనతార నెంబర్ వన్. కోలీవుడ్ లోనే కాదు.. సౌత్ లోనే నయనతార అధిక పారితోషకం తీసుకునే హీరోయిన్ అంటారు. ఈమధ్యన రజినీకాంత్ దర్బార్ లో నయనతార నటించినందుకు గాను... ఏకంగా పది కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి మరీ వసూలు చేసినట్లుగా వార్తలొచ్చాయి. ప్రస్తుతం నయనతార అధికంగా పారితోషకం వసూలు చెయ్యడమే కాకుండా తన పర్సనల్ సిబ్బంది ఖర్చులను నిర్మాతలకు వేస్తుంది అని.. చిన్న చిన్ననిర్మాతలకు నయనతారను తేవాలంటే భారంగా మారింది అని ప్రచారం జరిగింది. అయితే తాజాగా నయనతార పారితోషకం విషయంలో కాస్త  పట్టు సడలించినట్టుగా కోలీవుడ్ నిర్మాత ఒకరు చెబుతున్నారు. అయితే నయనతార పారితోషకం విషయంలో వెనక్కి తగ్గడం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

నయనతార దర్బార్ సినిమాకి ముందు 4 కోట్లు తీసుకునేది, కానీ దర్బార్ సినిమాకి పది కోట్ల పారితోషకం నయన్ డిమాండ్ చేసింది అని ప్రచారం జరిగింది కానీ అది అబద్దమని, 5.4  కోట్లు మాత్రం నయనతార దర్బార్ కి పారితోషకం అందుకుందని.. అయితే దర్బార్ నిర్మాతలు బడా నిర్మాతలు కాబట్టి లేక వారు ఆమెకి అధిక పారితోషకం ఇచ్చారని, కానీ నయనతార తాజా అన్నత్తై నిర్మాతలైన సన్ పిక్చర్స్ వారు చిన్న నిర్మాణా సంస్థ కాబట్టి అంత పారితోషకం ఇచ్చుకోలేమని నయన్ కి చెప్పగా... నయనతార కూడా సినిమాని వదులుకోవడం ఇష్టం లేక ఇంతకుముందు తీసుకున్న పారితోషకాన్ని కాకుండా తక్కువ మొత్తానికే నయనతార ఆ సినిమా చెయ్యడానికి ఒప్పుకుంది కానీ.. అది ఎంత పారితోషకం అనేది చెప్పలేమని చెబుతున్నాడు సదరు నిర్మాత. మరి దీన్ని బట్టి నయనతార కాస్త లైన్లోకొచ్చి.. చిన్న నిర్మాతలకు కూడా అందుబాటులోకి వచ్చినట్టే అనిపిస్తుంది.

Nayanthara Available for All Producers:

Nayantara Remuneration Dicresed for Small Producers

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ