మహేష్ బాబు - వంశి పైడిపల్లి సినిమా ఆగిపోయింది అనే న్యూస్ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చక్కర్లు కొడుతోంది. మహేష్ స్వయంగా చెప్పకపోయినా... తన టీం చేత వంశి పైడిపల్లితో చెయ్యాల్సిన సినిమా ఆగిపోయింది అని మీడియాకి లీకులు ఇప్పించాడనే ప్రచారం జరగడమే కాదు... వంశి పైడిపల్లి కూడా బాగా ఫీలవుతున్నాడట. సుకుమార్ లాగా ఏవో క్రియేటివ్ డిఫ్రెన్సెస్ వలన సినిమా ఆగిపోయింది అని చెప్పకుండా మహేష్ కి తగిన కథ వంశి డెవలప్ చెయ్యలేకపోయాడని లీకులు వదలడంతో వంశి పైడిపల్లి హర్ట్ అయ్యాడని అంటున్నారు. మహేష్ ఇలా చెయ్యడంతో వంశి పైడిపల్లికి ఏం చెయ్యాలో తెలియడం లేదని.. ఇలా మహేష్ మోసం చెయ్యడం కన్నా ఎక్కువగా వంశీ కథ గురించి బయట చర్చ జరగడం తన కెరీర్ పై ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉందని వంశీ టెన్షన్ పడుతున్నాడట. ఇదిలా ఉంటే మహేష్ మాత్రం సైలెంట్ గా తన పని తాను చేసుకుంటున్నాడు. మరి వంశీ - మహేష్ ఎలా ఉన్న మధ్యలో మరో వ్యక్తి నలిగిపోతున్నాడు.
ఆయనే నిర్మాత దిల్ రాజు. మహేష్ తో సోలోగా సినిమా నిర్మిద్దామంటే.. ఎవరో ఒకరు అడ్డం పడి సినిమాలో షేర్ కలుస్తున్నారు. మహర్షి, సరిలేరు సినిమాలకు అదే అయ్యింది. అందుకే ఈసారి వంశి పైడిపల్లితో సోలోగా మహేష్ సినిమాని నిర్మించేందుకు దిల్ రాజు ఏర్పాట్లు చేసుకున్నాడు. చాలా హ్యాపీగా మహేష్ సినిమాకి సోలో నిర్మాతగా దిల్ రాజు చెప్పుకుంటున్న టైంలో వంశి - మహేష్ సినిమా ఆగిపోవడంతో దిల్ రాజు కక్కలేక మింగలేక ఉన్నాడంటున్నారు. మహేష్ తో సోలో సినిమా చేసి లాభాలు గడించాలనుకుంటే మహేష్ ఇలా చేసాడేమిటా అని దిగులుపడుతున్నాడట. మళ్ళి మహేష్ సినిమా డేట్స్ ఎప్పుడు ఇస్తాడో అని కాచుకూర్చోవాలని సన్నిహితుల దగ్గర వాపోతున్నాడట.