Advertisementt

విశాల్ కి కరెక్ట్ గా పడింది పంచ్!

Thu 27th Feb 2020 02:18 PM
director mysskin,punch,vishal,detective,
detective 2 movie  విశాల్ కి కరెక్ట్ గా పడింది పంచ్!
Director Mysskin Punch on Vishal విశాల్ కి కరెక్ట్ గా పడింది పంచ్!
Advertisement
Ads by CJ

సోమవారం నుండి కోలీవుడ్ మీడియాలోనే కాదు.. టాలీవుడ్ లోను డిటెక్టీవ్ 2 సినిమా విషయంలో జరిగిన ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. డిటెక్టీవ్ 2 సినిమా దర్శకత్వ బాధ్యతల నుండి డైరెక్టర్ మిస్కిన్ ని హీరో విశాల్ తప్పించడమే కాకుండా విశాల్ దర్శకత్వ బాధ్యతలను చేపట్టినట్టుగా వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాపించాయి. మిస్కిన్ భారీ పారితోషకం డిమాండ్ చేసాడని, సినిమాకి 40 కోట్ల బడ్జెట్ అంటే.. దాన్ని డబుల్ చెయ్యడంతో విశాల్ కి కాలింది అని, హీరో దర్శకుడైతే అంటూ బోలెడన్ని న్యూస్ లు ప్రచారం లోకొచ్చాయి. అయితే ఈ వార్తలపై దర్శకుడు మిస్కిన్ తనదైన శైలిలో స్పందించడం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.

తాను 40 కోట్లు అడ‌గ‌లేద‌ని.. కానీ 400 కోట్లు అడిగాన‌ని.. అంతేకాకుండా శాటిలైట్ నుంచి హీరో దూకే స‌న్నివేశానికే 100 కోట్లు ఖర్చు పెట్టించా అని మొత్తానికి నేను 400 కోట్లు ఖర్చు పెట్టించా అని, కాదు 400 కోట్లు అడిగా అంటూ మిస్కిన్ వెటకారంతో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. కానీ మిస్కిన్ ఈ సినిమా నుంచి ఎందుకు త‌ప్పుకున్నాడో.. అనేది మాత్రం చెప్పకుండా దాచేసాడనిపిస్తుంది. అయితే ఇప్పుడు వెటకారంగా విశాలపై మిస్కిన్ వేసిన ట్వీట్ కి విశాల్ ఎలాస్పందిస్తాడో చూడాలి. అయితే డిటెక్టివ్ 2 మిగతా షూటింగ్ కి మాత్రం విశాల్ దర్శకత్వం వహించనున్నాడట. 

Director Mysskin Punch on Vishal:

Director Mysskin VS Vishal

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ