కొరటాల శివ - మెగాస్టార్ చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలోని చిరు లుక్ లీకై సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది. ముఠా మేస్త్రి టైంలో చిరు లుక్ ఎలా ఉందో కొరటాల శివ సినిమాలో చిరు లుక్ అలా ఉండడంతో మెగా ఫ్యాన్స్ ఆ లుక్ ని క్షణాల్లో వైరల్ చేసేసారు. ఆ లుక్ బయటికొచ్చినప్పటి నుండి సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక తాజాగా వినిపిస్తున్న న్యూస్ అయితే సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది. అదేమిటంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల - చిరు సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతున్నాడనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. వినడానికి వింతగానే ఉన్నా ఇది నిజమంటున్నారు.
మహేష్ బాబు.. చిరంజీవి పట్ల గౌరవం, కొరటాలతో స్నేహం కారణంగానే ఈ సినిమాలో గెస్ట్ రోల్ కి ఒప్పుకున్నాడని న్యూస్ నడుస్తుంది. అయితే మహేష్ చెయ్యడానికి మరో కారణమేమిటంటే.. మహేష్ కి స్క్రిప్ట్ మరియు ముఖ్యంగా అతని పాత్రను ఇష్టపడ్డాడని అందుకే ఒప్పుకున్నాడని అంటున్నారు. మహేష్ బాబు 40 నుండి 45 నిమిషాల పాత్రలో కనిపిస్తాడు మరియు మహేష్ కనబడే ప్రతి సన్నివేశం అతని అభిమానులకు గూస్బంప్స్ ఇస్తుంది అంటున్నారు. మొదట్లో ఈ పాత్రకి రామ్ చరణ్ అని.. ఇది ఫిక్స్ అన్నారు. కానీ చరణ్ RRR తో లాకవడంతో కొరటాల శివ బ్యాచ్ మహేష్ బాబు దగ్గరకు వచ్చారు. ఇది చాలా అరుదైన అవకాశంగా భావించి మహేష్ కూడా సినిమాలో భాగం కావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.