నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన చిత్రం భీష్మ బాక్సాఫీసు దగ్గర హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు ఇప్పటి వరకు ఈ సినిమా కలెక్షన్లు ఎక్కడా తగ్గకుండా లాభాల్లోకి వెళ్ళిపోయింది ఇటు తెలుగు రాష్ట్రాలతో సహా అటు అమెరికాలో ఈ సినిమా మంచి వసూళ్ళనే రాబడుతోంది. సినిమా సక్సెస్ కావడంతో హుషారుగా ఉన్న చిత్ర బృందం సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ లో నితిన్ మాట్లాడిన మాటలు టాలీవుడ్ యంగ్ హీరోకి పంచ్ తగిలేలా ఉన్నాయి.
హీరో నాగశౌర్య గత కొన్ని రోజులుగా నిత్యం వార్తల్లోనే ఉంటున్నాడు. తన సినిమా అశ్వద్ధామ థియేటర్ల నుండి వెళ్ళిపోయి చాలా రోజులవుతున్నా శౌర్య మాత్రం వార్తల్లోనే కనిపిస్తున్నాడు. శౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఛలో సినిమా కథ తనదేనని శౌర్య కామెంట్ చేయడంతో శౌర్య వెంకీ కుడుముల మీద వార్ ప్రకటించాడు. అయితే దర్శకుడు వెంకీ ఈ వార్ పెరగకుండా ఉండేలా చాలా హుందాగా సమాధానం ఇచ్చాడు.
అయితే సక్సెస్ మీట్ లో నితిన్ మాట్లాడుతూ దర్శకుడు వెంకీ కుడుములని చాలా పొగడ్తలతో ముంచెత్తాడు. తను కేవలం వెంకీని కాపీ కొట్టానని, అందుకే నా పర్ ఫార్మెన్స్ బాగుందని..ఆ క్రెడిట్ అంతా వెంకీదేనని చెప్పాడు. చివర్లో ఇంత సక్సెస్ అయిన ఈ కథని నువ్వే రాసావా అని వెంకీని అడగడంతో నాగశౌర్యకి గట్టి పంచ్ ఇచ్చాడు. మరి ఈ విషయమై శౌర్య ఇంకా ఏదైనా కామెంట్ చేస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆల్రెడీ రెండు మూడు వివాదాలతో నిత్యం మీడియాలో నానుతున్న శౌర్య ఈ విషయమై సైలెంట్ గా ఉంటేనే బాగుంటుందని అభిప్రాయ పడుతున్నారు. మరి శౌర్య ఏం చేస్తాడో..!