మహర్షి సినిమా మహేష్ కి మెమొరబుల్ హిట్ ఇచ్చిన వంశీ ఆ తర్వాత చిత్రం కూడా మహేష్ తోనే చేస్తానని లైన్ చెప్పి మహేష్ ని ఒప్పించాడు. వీరిద్దరి కాంబినేషన్ లో గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సినిమా ఉండబోతుందని ప్రచారం సాగింది. కానీ సడెన్ గా ఏమైందో తెలియదు వంశీతో మహేష్ సినిమా చేయట్లేదు అనే వార్తలు వచ్చాయి. లైన్ గా నచ్చిన కథ పుర్తి స్క్రిప్టు రెడీ అయ్యాక మహేష్ ని మెప్పించలేకపోయిందని ప్రచారం జరుగుతోంది.
దాంతో వంశీతో మహేష్ సినిమా ఆగిపోయింది. అయితే మహేష్ కోసమే సంవత్సరం పైగా వెయిట్ చేసిన వంశీ ఇప్పుడు ఎవరితో సినిమా చేస్తాడనేది ఆసక్తిగా మారింది. మహేష్ నచ్చని స్క్రిప్ట్ ని ఏ హీరో ఒప్పుకుంటాడన్నది హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో వంశీ పైడిపల్లి రామ్ చరణ్ ని కలుసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ మళయాల చితమైన లూసిఫర్ ని తెలుగులో రీమేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడని తెలిసిందే.
విక్టరీ వెంకటేష్ తో లూసిఫర్ సినిమా ఉంటుందని అంటున్నారు. అయితే ఈ సినిమాని డైరెక్ట్ చేయడానికి వంశీ రామ్ చరణ్ తో మాట్లాడారని టాక్. మరి రామ్ చరణ్ ఇందుకు అంగీకరించాడా లేదా అన్నది మాత్రం బయటకి రాలేదు. ఒక్క విషయం మాత్రం నిజం.. మహేష్ వంశీతో సినిమా చేయనన్న తర్వాత ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కనబడుతున్నాడు వంశీ.. మరి తన కోరిక ఎప్పుడు, ఎవరివల్ల నెరవేరుతుందో చూడాలి.