వంశి పైడిపల్లికి మహేష్ బాబు మహర్షి సినిమా అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినా.. బయ్యర్లకు నష్టాలేం రాలేదు. అలా అని లాభాలు రాలేదు. అయినప్పటికీ వంశీ పైడిపల్లితో మరో సినిమా అని ఊరించాడు మహేష్ బాబు. మహేష్ ని నమ్ముకుని మహేష్ కాంపౌండ్ లోనే ఉండిపోయాడు వంశీ పైడిపల్లి. స్టోరీ లైన్ తో ఇంప్రెస్ చేయగలిగాడు కానీ.. పూర్తి కథతో మహేష్ ని ఇంప్రెస్ చెయ్యలేకపోయాడు. మహర్షి సినిమా అప్పటి నుండి మహేష్ ఎక్కడుంటే వంశీ పైడిపల్లి అక్కడున్నాడు. మహేష్ తో వెకేషన్స్ ఎంజాయ్ చెయ్యడం దగ్గర నుండి క్రికెట్ కోసం విదేశాలకు వెళ్లడం, ఫ్యామిలీతో మహేష్ ఫ్యామిలీకి దగ్గరవడమే కాదు.. కూతురు ఆద్య కూడా మహేష్ కూతురు సితారతో కలిసి హడావిడి చెయ్యడం చూస్తే వంశీ పైడిపల్లి మహేష్ నే నమ్ముకున్నాడని అర్ధమవుతుంది.
మరి మహేష్ కూడా అధికారికంగా వంశీ సినిమాని ఎనౌన్స్ చేసాడు. వంశి మేకింగ్ నచ్చినా.. కథలో ఇన్వాల్మెంట్ నచ్చని మహేష్ అభిమానులు వంశీతో మరో సినిమా అనగానే కాస్త కంగారు పడ్డారు కానీ.. ఈమధ్యన మహేష్ డెసిషన్స్ వర్కౌట్ అవడంతో కామ్ అయ్యారు. తాజాగా మహేష్ - వంశీ పైడిపల్లి సినిమాపై వస్తున్న వార్తలకు బలం చేకూరేలా మహేష్ కానీ, వంశీ కానీ ఈ విషయంపై స్పందించకపోయేసరికి వీరి సినిమా ఆగిపోయిందనే వార్త బలంగా వినబడుతుంది. వంశీ ఎలాగూ చెప్పడు. కనీసం మహేష్ చెబితే ఓ క్లారిటీ వస్తుంది. మరి మహేష్ నే నమ్ముకున్న వంశీని ఉన్నట్టుండి నట్టేట ముంచేశాడు మహేష్. మహేష్ కి వేరే ఛాయస్ ఉంది.
కానీ వంశీ పరిస్థితి ఏమిటో అంటున్నారు. సుకుమార్ అంటే భారీ హిట్ ఉంది గనక మహేష్ వద్దంటే అల్లు అర్జున్ ని ఒప్పించాడు. కానీ వంశీ పైడిపల్లి చేతిలో భారీ హిట్ ఏది లేదు. ప్రస్తుతం స్టార్ హీరోస్ ఖాళీ గా లేరు. అలాంటప్పుడు మహేష్ ని నమ్ముకుని నిండా మునిగినట్లే కనబడుతుంది వంశీ పైడిపల్లి వ్యవహారం.