రణరంగం డిజాస్టర్ తర్వాత జానుతో భారీ హిట్ కొట్టాడు శర్వానంద్. ఆ సినిమాలో శర్వానంద్ సూపర్. సినిమా సూపర్ అంతే. కానీ సినిమాకి కలెక్షన్స్ రాకపోయేసరికి జాను సినిమా కూడా ప్లాప్ లిస్ట్ లోకెళ్ళిపోయింది. హిట్ ఆనందం శర్వానంద్ కి ఒక రోజు కూడా లేకుండా పోయింది. సరే ఆ సినిమా అలా ఉంటే ఇప్పుడు శర్వా హిట్ కొట్టిన నెక్స్ట్ సినిమా మాత్రం రిస్క్ లో ఉందనే టాక్ వినబడుతుంది. ఏప్రిల్ నెలాఖరుకి విడుదల కాబోతున్న శర్వానంద్ శ్రీకారం సినిమాకి కష్టాలు మొదలయినట్లుగా ఫిలింనగర్ టాక్. జాను హిట్ తో శర్వా కెరీర్ మళ్ళీ క్రేజీగా పుంజుకుంటుంది అనుకుంటే.. జాను హిట్ శర్వా మెడకు చుట్టుకుంది.
జాను సినిమాకి 70 శాతం నష్టాలొచ్చినట్లుగా మీడియాలో వార్తలు రావడంతో.. ఇప్పుడు శర్వానంద్ శ్రీకారం సినిమాని కొనేందుకు బయ్యర్లు ముందుకు రావడం లేదని.... ఒకవేళ వచ్చినా సో సో బేరాలు తప్ప అనుకున్న రేటు మాత్రం సినిమాకి రావడం లేదని అంటున్నారు. శ్రీకారం శాటిలైట్, డిజిటల్ హక్కుల కోసం ఎవరూ ముందుకు రావడం లేదని.. లేదంటే ఈపాటికే శాటిలైట్, డిజిటల్ హక్కులు అమ్ముడైపోవాలని అంటున్నారు. వరస ప్లాప్స్ తో మార్కెట్ పడిపోవడం ఇప్పుడు శ్రీకారం సినిమాకి కష్టాలొచ్చాయంటున్నారు. మరి శర్వానంద్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని సినిమాకి బడ్జెట్ పెట్టినా.. ఇప్పుడు ఆ మార్కెట్ రేటు కూడా వచ్చేలా లేదని నిర్మాతలు కూడా సినిమాని పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా టాక్.