Advertisementt

మెలోడీతో మత్తెక్కిస్తున్న నాని వి

Mon 24th Feb 2020 09:43 PM
nani,sudheer babu,v the movie,dil raju,  మెలోడీతో మత్తెక్కిస్తున్న నాని  వి
First single released from Nani V మెలోడీతో మత్తెక్కిస్తున్న నాని వి
Advertisement
Ads by CJ

నాని, సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వి. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ రిలీజై ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. అష్టాచమ్మా, సమ్మోహనం వంటి ఫీల్ గుడ్ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు మొదటిసారిగా తన దారిని వదిలి థ్రిల్లర్ జోనర్ లో చేసిన చిత్రమిది. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుండగా, నాని సైకో కిల్లర్ గా కనిపిస్తున్నాడని సమాచారం.

 

దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చ్ 25 వ తేదీన విడుదలకి సిద్ధం అవుతోంది. సినిమా విడుదలకి ఇంకా నెలరోజులు టైమ్ ఉండగా అప్పుడే ప్రమోషన్లు స్టార్ట్ చేసింది చిత్ర బృందం. నేడు నాని పుట్టినరోజుని పురస్కరించుకుని ఫస్ట్ సింగిల్ ని వదిలారు. మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదీ ఏమో ఈ వేళ అంటూ సాగిన ఈ మెలోడీ ఆద్యంతం చెవులకి ఇంపుగా ఉండడంతో పాటు నిజంగానే మనసు మత్తు చల్లుతున్నట్లుగా ఉంది.

 

పాట వింటున్నంత సేపు ఏదో మత్తులో ఉన్న ఫీలింగ్ లో పడేస్తుంది. సిరివెన్నెల రాసిన సాహిత్యం పాటకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సాహిత్యానికి తగ్గట్టుగా మనసుని నిద్రలోకి జారుస్తున్నట్టుగా పాడిన విధానం కూడా చాలా బాగుంది. అమిత్ త్రివేది సంగీతం అందించిన ఈ పాటను అమిత్ త్రివేది, శాషా తిరుపతి, యాజిన్ నిజార్ లు కలిసి పాడారు. అయితే ఇంత మంచి మెలోడీ ఇద్దరు హీరో, హీరోయిన్లలో ఎవరి మధ్య ఉందనే విషయం మాత్రం అర్థం కావడం లేదు.

First single released from Nani V:

 A soulful melody from Nani V

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ