Advertisementt

దర్శకులందరికీ ఈ సినిమా అంకితం: బాలు

Mon 24th Feb 2020 11:37 PM
dhanya balakrishna,siddhi idnani,anukunnadhi okkati ayyindhi okkati,release,march 6  దర్శకులందరికీ ఈ సినిమా అంకితం: బాలు
Anukunnadhi Okkati Ayyindhi Okkati Movie Press Meet Details దర్శకులందరికీ ఈ సినిమా అంకితం: బాలు
Advertisement
Ads by CJ

దర్శకులు అందరికీ ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ అంకితం! - బాలు అడుసుమిల్లి

బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెంబర్‌ 1గా హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న సినిమా ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌ ప్రధాన పాత్రధారులు. సోమవారం ఉదయం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో సినిమా కొత్త ట్రైలర్ విడుదల చేశారు. మార్చి 6న చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శక-నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో... 

ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ... ‘‘సినిమాలోని నలుగురు హీరోయిన్లలో నేను ఒక అమ్మాయిగా నటించాను. ధన్య అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి పాత్రలో కనిపిస్తాను. నా కెరీర్ లో నేను చేసిన ఎక్స్పెరిమెంటల్, ఎక్సైటింగ్ సినిమా ఇది’’ అని అన్నారు.

సిద్ధీ ఇద్నాని మాట్లాడుతూ... ‘‘చిన్నప్పటి నుండి స్నేహితులైన నలుగురు అమ్మాయిల కథే ఈ సినిమా. వినోదాత్మకంగా ఉంటుంది. థియేటర్లలో హాయిగా నవ్వుకోవచ్చు. థియేటర్లకు రండి. సినిమా చూడండి’’ అని అన్నారు.

త్రిధా చౌదరి మాట్లాడుతూ... ‘‘ఈ సినిమాలో నేను ఓ భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. గతంలో నేను సోలో హీరోయిన్ గా సినిమాలు చేశా. ఫస్ట్ టైం ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లతో కలిసి నటించా. నలుగురు హీరోయిన్లు ఉన్నప్పుడు హీరో అవసరమా? మేం బి సినిమాకు షీరోస్ (SHEros). అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ సినిమా ఇది. కథలో హీరోయిన్లు నలుగురు పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది’’ అని అన్నారు.

కోమలి ప్రసాద్ మాట్లాడుతూ... ‘‘హీరోయిన్ గా నా సెకండ్ ఫిల్మ్ ఇది. సినిమా చాలా బాగుంటుంది. నెలంతా కష్టపడి అలసిపోయిన ప్రేక్షకులు మార్చి 6న హాయిగా రెండు గంటలపాటు నవ్వుకోవడానికి మా సినిమా థియేటర్లకు రండి. రెండోసారి మూడోసారి నాలుగోసారి ఎన్నిసార్లైనా చూడొచ్చు. పాప్ కార్న్ తింటూ ఎంజాయ్ చేయవచ్చు’’ అని అన్నారు.

దర్శకుడు బాలు అడుసుమిల్లి మాట్లాడుతూ... ‘‘ఇన్ని రోజులు మీడియాలో ఒకడిగా, మీడియా సభ్యుల మధ్య ఉన్నాను. ఇప్పుడు మీడియా ముందు నన్ను నిలబెట్టారు. మీడియా నుండి వచ్చి ఒక సినిమాకు దర్శకత్వం వహించడం అనేది పెద్ద స్టెప్. అందులో ఎంత పెయిన్ ఉంటుందో నాకు తెలుసు. చాలామంది దర్శకులు కావాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకని, దర్శకులు అందరికీ ఈ సినిమాను అంకితం చేస్తున్నా. వినోదంతో కూడిన మంచి కథతో సినిమా తీశా. నా వైఫ్ హిమబిందు నిర్మాతగా మారి నాకు ఎంతో సపోర్ట్ చేసింది. రఘురామ్ సపోర్ట్ కూడా మరువలేనిది. సినిమా మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఆల్మోస్ట్ మూడు కోట్ల బడ్జెట్ అయ్యింది’’ అని అన్నారు.

చిత్ర సహనిర్మాత రఘురామ్‌ యేరుకొండ మాట్లాడుతూ... ‘‘నలుగురు అందమైన అమ్మాయిలతో అందంగా, అద్భుతంగా బాలు గారు సినిమా తీశారు. మార్చి 6న విడుదలవుతోంది. ప్రేక్షకులందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.

చిత్ర నిర్మాత హిమబిందు వెలగపూడి మాట్లాడుతూ... ‘‘బాలు దర్శకుడు అవుతానని చెప్పినప్పుడు షాకయ్యా. కథ విన్న తర్వాత ట్రై చేయమని చెప్పాను. తర్వాత మేమే సినిమా నిర్మించాలనే నిర్ణయానికి వచ్చాము. రఘురామ్ గారు, శ్రీరామ్ గారు ఎంతో సపోర్ట్ చేశారు’’ అని అన్నారు.

‘‘సినిమా డబుల్ రొట్టెలా ఉంటుంది’’ అని నటుడు లోబో అన్నారు.

‘‘సినిమాల్లో బెల్ బాయ్ క్యారెక్టర్ చేశా. నాది కామెడీ రోల్. సిద్ధి ఇద్నాని గారిపై మనసు పారేసుకున్న ఒక బెల్ బాయ్ రోల్’’ అని నటుడు బాషా అన్నారు.

నటీనటులు:

ధన్యా బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌, రఘుబాబు, హిమజ, రఘు కారుమంచి, సమీర్‌ తదితరులు

సాంకేతిక నిపుణులు:

అసోసియేట్‌ డైరెక్టర్‌: లక్కీ బెజవాడ, ఎడిటర్‌: తెల్లగుటి మణికాంత్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎల్‌ఎన్‌ వారణాసి, వైజేఆర్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: నేహా మురళి, ఆర్ట్‌ డైరెక్టర్‌: గాంధీ నడికుడికర్‌, సినిమాటోగ్రఫీ: శేఖర్‌ గంగమోని, సంగీతం: వికాస్‌ బాడిస, కో–డైరెక్టర్‌, డైలాగ్స్‌: విజయ్‌ కామిశెట్టి, సహ నిర్మాత: రఘురామ్‌ యేరుకొండ, నిర్మాత: హిమ బిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌, రచన, దర్శకత్వం: బాలు అడుసుమిల్లి.

Anukunnadhi Okkati Ayyindhi Okkati Movie Press Meet Details:

Anukunnadhi Okkati Ayyindhi Okkati is Super Fun: Makers say Ahead of Release on March 6

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ