అవును మీరు వింటున్నది నిజమే.. ‘ఆపమ్మా ఆపు.. ఇదే పనా బోర్ కొట్టట్లేదా నీకు!’ అంటూ ఎప్పుడూ కూల్‌గా ఉండే సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఒక్కసారిగా ఒకింత ఫన్నీగా.. కోపంగా కనిపించాడట. ఇంతకీ ఏమైంది..? నిజంగానే మహేశ్ అంత మాట అన్నాడా..? అనే సందేహం కలుగుతోంది. కదూ.. అవునట ఆయన అన్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయ్.. అసలు విషయమేంటో ఇప్పుడు చూద్దాం.
ఇటీవల మహేశ్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించాడు. ఆయన కనపడే సరికి అక్కడున్న యూత్, జనాలంతా ఒక్కసారిగా అలెర్ట్ అయ్యి.. సూపర్‌స్టార్‌నే కళ్లార్పకుండా చూడసాగారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ ఫొటోగ్రాఫర్ మళ్లీ అవకాశం వస్తుందో రాదో అన్నట్లు టిక్ టిక్ అంటూ తన కెమెరాకు బుద్ధి చెప్పాడు!. మహేశ్ ఫొటోలు తీస్తుండగా.. ఆ ఫొటోగ్రాఫర్‌పై ఒకింత ఫన్నీగా.. ఒకింత సీరియస్ అయ్యారట. ‘ఆపమ్మా ఆపు.. ఏంటిది.. ఎప్పుడూ మీకు ఇదే పనా బోర్ కొట్టట్లేదా’ అని అన్నారట.
అయితే ప్రస్తుతం ఆ కెమెరామెన్ తీసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. మహేశ్ మాట్లాడిన మాటలు సరిగ్గా వినపడట్లేదని కానీ వీడియో మాత్రం క్లారిటీగానే ఉంది. కాగా.. ఇదివరకే మొన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయంలోనూ ఇలాంటి ఘటన జరిగిన విషయం విదితమే. తారక్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయటికి వెళ్తుండగా ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తూ వెళ్తుంటే.. ‘మీరు ఇక్కడే ఉంటారా అండీ.. తిండి స్నానం అన్నీ ఇక్కడేనా’ అని సరదాగా ఆటపట్టించాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంటే అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు మహేశ్ బాబు ఇద్దరూ ఫన్నీగానే మాట్లాడరంతే.. సీరియస్‌గా తీసుకోవాల్సిన అక్కర్లేదన్న విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి.
వీడియో కోసం క్లిక్ చేయండి