Advertisementt

మహేష్ అభిమానుల కోరిక నెరవేరిన వేళ...?

Mon 24th Feb 2020 10:12 AM
mahesh babu,vamshi,parashuram  మహేష్ అభిమానుల కోరిక నెరవేరిన వేళ...?
Mahesh Fans happy with this news మహేష్ అభిమానుల కోరిక నెరవేరిన వేళ...?
Advertisement
Ads by CJ

సరిలేరు నీకెవ్వరు సూపర్ సక్సెస్ తో జోరుమీదున్న మహేష్ తర్వాతి చిత్రం వంశీ పైడిపల్లితో చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. వంశీ మహేష్ కి లైన్ చెప్పాక ఆ లైన్ పై బాగానే కష్టపడ్డాడట. స్క్రిప్టు పనులు ఇంకా జరుగుతుండగా సడెన్ గా మహేష్ వేరే దర్సకుడితో సినిమా చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై ఎవరూ నోరు మెదపకపోవడంతో వంశీతో సినిమా చేయట్లేదని కన్ఫర్మ్ చేసేసుకున్నారు. ఇప్పుడు వంశీ సినిమా మహేష్ తో లేనట్లే..

 

అయితే ఇలా ఎందుకు జరిగింది.. సడెన్ గా మహేష్ వంశీతో సినిమా ఎందుకు మానేశాడు అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వీటికి సమాధానం బయటకి రాకపోయినప్పటికీ కొన్ని ఆసక్తికరమైన కథనాలు బయటపడ్డాయి. వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్న మహేష్ కి వంశీ చెప్పిన కథ నచ్చలేదట. లైన్ గా కథ బాగున్నా దాని ఫుల్ లెంగ్త్ మహేష్ కి నచ్చలేదట. అందుకే వంశీతో సినిమా చేయడానికి నిరాకరించాడని సమాచారం.

 

వంశీతో సినిమా చేయకపోవడంతో మహేష్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. మహర్షి సినిమా కమర్షియల్ గా వసూళ్ళు కలెక్ట్ చేసినా, ఆ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. అందుకే అప్పట్లో తర్వాతి సినిమా మళ్ళీ వంశీతో అని ప్రకటించినపుడు వద్దని వారించారు. ఎట్టకేలకు మహేష్ అభిమానుల కోరిక నెరవేరిందనే చెప్పాలి. ప్రస్తుతం గీత గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు పరశురామ్ తో సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

Mahesh Fans happy with this news:

Mahesh is not interested to do a movie with Mahesh

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ