Advertisementt

రష్మిక మందన్నా.. సూపరంతే..!

Mon 24th Feb 2020 09:24 PM
rashmika mandanna,role,highlight,bheeshma  రష్మిక మందన్నా.. సూపరంతే..!
Rashmika Mandanna Role highlight in Bheeshma రష్మిక మందన్నా.. సూపరంతే..!
Advertisement
Ads by CJ

ఈ ఏడాది మహేష్ తో కలిసి నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్ హిట్ అవడంతో హీరోయిన్ రష్మిక మామూలు ఆనందంగా లేదు. మహేష్ లాంటి స్టార్ హీరో సినిమాలో చెయ్యడం అంటే నమ్మలేకపోతున్నా అంటూ స్టేజ్ మీద ఫోజులు కొట్టింది. ఆ తర్వాత అల్లు అర్జున్ తో అవకాశం అంటే మాములుగా లేదు అమ్మడు వ్యవహారం అన్నారు. వరసగా స్టార్ హీరోస్ సినిమాలు రష్మిక ఇక సూపర్ అన్నారు. ఇక నితిన్ తో కలిసి నటించిన భీష్మ తాజాగా విడుదల కావడం సినిమా సూపర్ హిట్ టాక్ రావడంతో రష్మిక గాల్లో తేలిపోతుంది. ఫస్ట్ టైం గ్లామర్ పాత్రతో రష్మిక అదరగొట్టేసింది. అందంగానే కాదు.. నటనలోను రష్మిక సూపర్ అనిపించింది.

సినిమా హైలెట్స్ లో రష్మిక - నితిన్ కెమిస్ట్రీని తెగ పొగుడుతున్నారు. ఎక్సప్రెషన్స్ లో కానీ... నటనలో కానీ రష్మికని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. రష్మిక మందన్న పాత్రకు ఫిట్ అనిపించింది. మరి సాంగ్స్ లోను రష్మిక అందాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. అందంగా హాట్ గా రష్మిక భీష్మ హిట్ లో భాగస్వామి అయ్యింది. మరి వరసగా సరిలేరు నీకెవ్వరు భీష్మ హిట్స్ తో అమ్మడు ఎక్కడా ఆగేలా లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా మాత్రమే ఒప్పుకున్న రష్మికకి ఇక వరస ఆఫర్స్  రావడం ఖాయం. ఇప్పటికే త్రివిక్రమ్ లాంటోళ్లని ఆఫర్స్ కోసం అడుగుతున్న రష్మికకి త్వరలోనే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ఛాన్స్ వచ్చినా రావొచ్చని టాక్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

Rashmika Mandanna Role highlight in Bheeshma:

Rashmika gets hit with Bheeshma

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ