విజయ్ దేవరకొండ క్రేజ్ కి బాలీవుడ్ ఫిదా అయినా విషయం తెలిసిందే. రౌడీ స్టయిల్ కి హీరోయిన్స్ మాత్రమే కాదు.. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ సైతం పడిపోయాడు. అందుకే విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ ని హిందీలో రీమేక్ చేద్దామనుకుని.. సౌత్ లో ప్లాపవ్వడంతో వెనక్కి తగ్గాడు. ఇక తర్వాత విజయ్ దేవరకొండ బాలీవుడ్ క్రేజ్ ని ముందు నేనే వాడాలనుకుని కరణ్ జోహార్. పూరి జగన్నాధ్ తో విజయ్ దేవరకొండ చెయ్యబోయే సినిమాని పాన్ ఇండియా అప్పీల్ తీసుకొచ్చి మరీ నిర్మాణ భాగస్వామిగా మారాడు కరణ్ జోహార్.
అయితే విజయ్ దేవరకొండకున్న భారీ క్రేజ్ ని కరణ్ క్యాష్ చేసుకుందామని డిసైడ్ అయ్యాడు కాబట్టి ఆ సినిమాలో వాటా కలిసాడు. అయితే డియర్ కామ్రేడ్ పోవడం, మళ్ళీ విజయ్ తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా అట్టర్ ప్లాప్ అవడంతో విజయ్ క్రేజ్ మీద కరణ్ జోహార్ కి టెన్షన్ పట్టుకుంది అనే టాక్ మొదలైంది. వరస ప్లాప్స్ ఉన్న విజయ్ తో సినిమా అంటే ఇప్పుడు కరణ జోహార్ భయపడుతున్నాడంటున్నారు. కానీ కరణ్ జోహార్ కి మాత్రం విజయ్ దేవరకొండ క్రేజ్ మీద ఎలాంటి అనుమానం లేదట. కేవలం విజయ్ క్రేజ్ తోనే సౌత్ లో ప్లాప్ అయినా డియర్ కామ్రేడ్ హిందీ యూట్యూబ్ లో దుమ్ము లేపింది. అది విజయ్ క్రేజ్ అని కరణ్ సన్నిహితుల దగ్గర అంటున్నాడట. సో కరణ్, విజయ్ క్రేజ్ విషయంలో టెన్షన్ పడుతున్నాడనే వార్తల్లో నిజానిజాలివే.