ఛలో సినిమా కాంబినేషన్ నాగ శౌర్య - వెంకీ కుడుముల ఇద్దరు వేర్వేరుగా సినిమాలు చేసుకున్నారు. ఛలోతో మంచి హిట్ కొట్టిన నాగ శౌర్య తరవాత నర్తనశాల, అశ్వద్ధామ సినిమాలు చేయడం, వెంకీ కుడుముల, నితిన్ తో భీష్మ సినిమా చెయ్యడం జరిగింది. అయితే నాగ శౌర్యకి, వెంకీ కుడుములకి మధ్యలో విభేదాలు ఉన్నట్టుగా నాగ శౌర్య అశ్వద్ధామ ప్రమోషన్స్ అప్పుడు చెబితేనే అందరికి తెలిసింది. వెంకీ మీద నాగ శౌర్య ఫైర్ అయ్యాడు. వెంకీ ఏం చేసాడో చెప్పకుండా నేను ఇచ్చిన కారుని అమ్ముకున్నాడు. నా కథ ఇచ్చి ఛలో సినిమాని వెంకీ డైరెక్ట్ చేసేలా చేశా కానీ.. ఈసారి వెంకీ కుడుముల తన కాంపౌండ్ లో కాలు పెట్టనివ్వనని అన్నాడు. ఎందుకో తెలియదు నాగ శౌర్య మాత్రం హాట్ హాట్ గా వెంకీని ఇరికించాడు.
అయితే భీష్మ ప్రమోషన్స్ లో వెంకీ కుడుముల, నాగ శౌర్య వ్యాఖ్యలపై స్పందిస్తాడని అనుకున్నారు. మీడియా కూడా వెంకీ వెంట పడింది. అయితే ముందే వెంకీ ఈ విషయమై పక్కా క్లారిటీతో ఉన్నాడు. అందుకే మీడియా అడగ్గా అడగ్గా.. తమ పర్సనల్ విషయాలు తెలుసుకోవాలనే ఉద్దేశ్యం ప్రేక్షకులకు లేదు. ఇక నాగ శౌర్య ఇచ్చిన కారుని నేను అమ్మలేదు. అమ్మే ఉద్దేశ్యం కూడా లేదు అని తన తొలి సినిమా గుర్తుగా మాత్రం ఆ కారు ఉంచుకున్నా అని చెబుతున్నాడు వెంకీ కుడుములు. మరి ఉంచుకున్నా అంటున్నాడు కానీ... దానిని మాత్రం వాడడం లేదు. మరి భీష్మ హిట్ అయ్యాక రెండు ప్లాప్స్ తో ఉన్న నాగ శౌర్యకి, వెంకీ ఏమన్నా కౌంటర్ ఇస్తాడేమో చూడాలి.