టాలీవుడ్ లో ఫిట్ నెస్ కి మారుపేరుగా రకుల్ ప్రీత్ తో పాటుగా సమంత నిలుస్తారు. డైలీ వర్కౌట్స్ తో బాడీని ఫిట్ గా మంచి షేప్ లో ఉంచుకుంటారు. రకుల్ ప్రీత్ అయితే అనుష్క యోగా కూడా చేస్తుంది. జిమ్ లో వర్కౌట్ వీడియోస్ తో ఎప్పుడూ అందరికి స్ఫూర్తినిస్తోంది. ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యమని ఒకరోజు బద్దకించినా కుదరదని ఫిట్నెస్ అందాన్ని కాదు ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుంది అని అంటుంది. రేపు మొదలెడదాం, ఎల్లుండి మొదలెడదాం అని కాకుండా రోజూ వర్కౌట్ చెయ్యాలి అని మనం ముందు మన మైండ్ సెట్ మార్చుకోవాలని ఆరోగ్య సూత్రాలు వల్లిస్తుంది రకుల్. ఆరోగ్యం కోసం ఆ మాత్రం చెయ్యకపోతే అసలు మన జీవితమే వేస్ట్ అని చెబుతుంది రకుల్ పాప.
ఇక పాత్రలు డిమాండ్ చేసినా తానూ మాత్రం బరువు పెరిగే పాత్రలు చెయ్యనని ఖరాఖండిగా చెబుతుంది. ఆరోగ్యానికి హాని కలిగించే అలాంటి పాత్రలు చేయకపోవడమే మంచిది అని చెబుతుంది రకుల్ ప్రీత్. బాలీవుడ్ ఫిలిం చేస్తున్నప్పుడు అదే దేదే ప్యార్ కీయ చేస్తున్నప్పుడు 40 రోజుల్లో 8 కిలోలు తగ్గానని... బరువు తగ్గడం అసలు ఇబ్బంది కాదని.. కానీ ఒక సినిమాలోని పాత్ర కోసం 20 కిలోల బరువు పెరగాలంటే కష్టమని చెబుతుంది రకుల్. కష్టం కాదు నేనసలు ఒప్పుకోను అని చెబుతుంది. నా ఆరోగ్యానికి హాని కలిగించే పనులు తాను చెయ్యను అని చెబుతుంది.