నేచురల్ స్టార్ నాని హీరోగా మోహనక్రిష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వి. సుధీర్ బాబు మరో హీరోగా కనిపిస్తున్నాడు. అయితే సాధారణంగా మోహనక్రిష్ణ సినిమా పేర్లన్నీ తెలుగుపేర్లే ఉంటాయి. కానీ ఈ సారి కొత్తగా వి అనే పేరును పెట్టారు. ఈ పేరు పెట్టినప్పటి నుండి ఈ సినిమా టైటిల్ పై ఆసక్తి బాగా పెరిగింది. అసలు వి అంటే ఏంటని సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. టీజర్ రిలీజ్ అయిన నేపథ్యంలో నాని ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నాడు.
అంటే మొదటిసారి విలనిజాన్ని పండించబోతున్నట్లు తెలుస్తుంది. నాని విలన్ గా చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమాకి అర్థం విలన్ అయి ఉంటుందని భావించారు. కానీ అసలు విషయానికి వస్తే టైటిల్ వి అంటే విలన్ కాదట. ఈ సినిమా నాని సైకో కిల్లర్ గా కనిపిస్తున్నాడట. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసరుగా నానిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడట. నాని చేసే ప్రతీ హత్య దగ్గర వి అనే లెటర్ ని పెడుతుంటాడట. సుధీర్ బాబు ఆ లెటర్ కి ఉన్న క్లూ సాయంతో నానిని పట్టుకుంటాడట. మరి ఈ వార్త ఎంతమేరకు నిజమో సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు.