టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి పాన్ ఇండియా ఫిలింగా అన్ని భాషల్లోనూ విడుదలై సంచలన సృష్టించింది. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రాజమౌళి బాహుబలిలో నటించిన తరువాత దేశవ్యాప్తంగా సూపర్ స్టార్ డమ్ సంపాదించాడు. బాహుబలి తర్వాత వచ్చిన క్రేజ్ తో ప్రభాస్ మళ్ళీ పాన్ ఇండియా ఫిలిం చేసాడు. అది ఓ తెలుగు చిన్న దర్శకుడితో సాహి సినిమాని పాన్ ఇండియా ఫిలింగా మలిచి దెబ్బతిన్నాడు. అయినప్పటికీ ప్రభాస్ మళ్ళీ రాధాకృష్ణ దర్శకత్వంలో చిన్న లైన్ తోనే పాన్ ఇండియా ఫిలింకి రెడీ అయ్యాడు. బాహుబలి క్రేజ్ ని వాడుకోవాలని ప్రభాస్ గట్టిగానే డిసైడ్ అయ్యాడు.
అయితే ప్రభాస్ లాగా ఎన్టీఆర్ పాన్ ఇండియా ఇమేజ్ కోసం పాకులాడడం లేదనిపిస్తుంది. రామ్ చరణ్ తో కలిసి బడా మల్టీస్టారర్ పాన్ ఇండియా ఫిలిం RRR లో నటిస్తున్న ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని పాన్ ఇండియా ఫిలింగా చెయ్యొచ్చు. RRR తర్వాత ఎన్టీఆర్ కి పాన్ ఇండియన్ ఇమేజ్ వస్తుందనే నమ్మకంతో వివిధ భాషలకు చెందిన ప్రముఖ దర్శకులు పాన్ ఇండియన్ అప్పీల్‌తో ఉన్న బలమైన కథలతో ఎన్టీఆర్ వద్దకు వచ్చారు. వారిలో ముఖ్యంగా తమిళ దర్శకుడు అట్లీ మరియు కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఉన్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం త్రివిక్రమ్ తో సినిమా ఎనౌన్స్ చేసి పాన్ ఇండియా ప్రేక్షకులతో పాటుగా టాప్ డైరెక్టర్స్ కి షాకిచ్చాడు. అయితే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీ కూడా పాన్ ఇండియా ఫిలింగా వుండే ఛాన్స్ ఉందనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది.