రూపేష్ పోలీస్ డ్రెస్ లో చాలా బాగున్నాడు, డైరెక్టర్ గా శివకు ‘22’ సినిమా బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా - యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్, సూపర్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించుకున్న శివకుమార్ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘22’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవల డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేతులమీదుగా విడుదలైన ఫస్ట్‌లుక్, కింగ్ నాగార్జున విడుదల చేసిన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్ వస్తోంది. తాజాగా ఈ చిత్రం నుండి ‘మార్ మార్ కె జీనా హై.. బార్ బార్ యహ మర్నాహై..’ లిరికల్ వీడియో సాంగ్‌ను 22-02-2020న ఉదయం 8:59 నిమిషాలకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. అనంతరం..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ - ‘‘ఇప్పుడే ‘22’ మూవీ లిరికల్ వీడియో సాంగ్ చూశాను. వెరీ నైస్.. చాలా బాగుంది. శివకు దర్శకుడిగా మొదటి సినిమా. బిఎ రాజు గారు, జయ గారు ఎప్పటి నుంచో మాకు తెలుసు. రూపేష్ పోలీస్ డ్రెస్ లో చాలా బాగున్నాడు. సినిమా బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ‘22’ కచ్చితంగా ఒక డిఫరెంట్ మూవీ అవుతుంది. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్. ప్లీజ్ సపోర్ట్ ది ఫిల్మ్’’ అన్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ దసపల్లా హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..
హీరో రూపేష్‌కుమార్ చౌదరి మాట్లాడుతూ - ‘‘ఈ రోజు నా ఫస్ట్ మూవీ ఫస్ట్ సాంగ్‌ను ప్రభాస్‌గారు లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆ ఆనందాన్ని మీతో పంచుకోవడానికి నా దగ్గర మాటల్లేవు. ప్రభాస్‌గారి లాంటి పెద్ద స్టార్ నన్ను ఎంకరేజ్ చేస్తూ పోలీస్ డ్రెస్‌లో చాలా బాగున్నావని అనడం ఒక అవార్డులా భావిస్తున్నాను. మంచి లిరిక్స్ రాసిని కాసర్లశ్యామ్ గారికి, మంచి సంగీతం అందించిన సాయికార్తీక్ గారికి థ్యాంక్స్. కార్తీక్‌గారు సినిమాకి మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించారు. ఈ అవకాశం ఇచ్చిన శివగారికి ధన్యవాదాలు’’ అన్నారు.
చిత్ర దర్శకుడు శివకుమార్. బి మాట్లాడుతూ - ‘‘22-02-2020 రోజున మా 22 మూవీ ఫస్ట్ లిరికల్ వీడియోను ప్రభాస్‌గారు విడుదల చేయడం సంతోషంగా ఉంది. ప్రభాస్‌గారి గురించి చెప్పాలంటే...డిక్షనరీలో లవ్, డార్లింగ్ అనే పదాలను తీసేసి ప్రభాస్ అనే ఒక్క పదం పెడితే సరిపోతుందెమో. అంత మంచి పర్సనాలిటీ. ప్రభాస్‌గారు ఈ సాంగ్ లాంచ్ చేస్తున్నారు అనగానే చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. సాంగ్ లాంచ్ చేసి, సినిమా కాన్సెప్ట్ గురించి అడిగి తెలుసుకుని, కథలో మంచి డెప్త్ ఉంది. ఈ సినిమాను బాగా ప్రమోట్ చేయండి, తప్పకుండా బిగ్ హిట్ అవుతుంది అని చెప్పి మా టీమ్ అందర్నీ విష్ చేశారు. ప్రభాస్‌గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక సాంగ్ గురించి చెప్పాలంటే... సాయికార్తీక్, నేను ఈ పాట ఎవరు రాస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు మా అమ్మగారు పరిచయం చేసిన శ్యామ్ అయితే బాగుంటుందనిపించి ఇలా ప్లాన్ చేశాం. నిజానికి ఇది ప్లాన్ కాదు. డెస్టినీ అనిపిస్తోంది. సాంగ్ కొత్తగా ఉండాలని నేను, సాయి, శ్యామ్ అనుకోని హిందీ లిరిక్స్‌ను మిక్స్ చేశాం. మరి.. సింగర్ ఎవరు అని అడగగానే సాయికార్తీక్ నేను పాడించి చూపిస్తాను అని చెప్పారు. నేను పాట వినగానే ఈ పాట పాడింది మ్యాడీయేనా అనుకున్నాను. అంత గొప్పగా పాడారు. ఆ తర్వాత టీజర్‌లో ఏదైతే నవ్వు వస్తుందో దాని గురించి చాలా మంది అడిగారు. ఆ గొంతు మ్యాడీదే. దాని వల్ల సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ‘22’ సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన హీరో రూపేష్‌గారికి థ్యాంక్స్. రవికిరణ్, పెద్దిరాజు బాగా సపోర్ట్ చేశారు. నాకు దర్శకత్వ శాఖలో పని చేసే అవకాశం ఇచ్చి దర్శకత్వంలో మెళుకువలు నేర్పించిన దర్శకులు పూరీ జగన్నాథ్, వి.వి.వినాయక్, మారుతి గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు’’ అన్నారు.
చిత్ర నిర్మాత శ్రీమతి సుశీలాదేవీ మాట్లాడుతూ - ‘‘ఈ సినిమా టాకీపార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు.
సంగీత దర్శకుడు సాయికార్తీక్ మాట్లాడుతూ - ‘‘మా సాంగ్ లాంచ్ చేసిన ప్రభాస్‌గారికి, ఈ సినిమాను ఆయన వరకు తీసుకువెళ్లిన మా బాబాయి బి.ఎ.రాజుగారికి ధన్యవాదాలు. ఈ సినిమా హీరోగా రూపేష్‌కి, దర్శకుడిగా శివకు పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది. తప్పకుండా సూపర్‌హిట్ అవుతుంది. ఇది నేను సినిమా చూసి చెబుతున్నమాట’’ అన్నారు.
సూపర్ హిట్ అధినేత, నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - ‘‘మా అబ్బాయి శివ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘22’ ఫస్ట్ సాంగ్ వీడియోను ప్రభాస్‌గారు రిలీజ్ చేసి సిసిమా బిగ్ హిట్ అవ్వాలని టీమ్ ని విష్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది మీడియా సినిమా. చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. మీడియా సహకారంతోనే ఈ సినిమా కచ్చితంగా పెద్ద రేంజ్‌కి వెళ్తుంది. ‘22’ టీమ్ తరపున ప్రభాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు’’ అన్నారు.
గీత రచయిత కాసర్లశ్యామ్ మాట్లాడుతూ - ‘‘నన్ను‘చంటిగాడు’ సినిమాతో జయమేడమ్‌గారు గీత రచయితగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ సినిమాలో నా చేత హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ‘కొక్కొరకో’ పాట రాయించి, నన్ను ప్రోత్సహించారు. భవిష్యత్‌లో గీత రచయితగా మంచిస్థాయికి వెళతావని ఆశీర్వదించారు. ఆమె ఆశీర్వాద బలంతోనే ఈ రోజు నేను ఇండస్ట్రీలో ‘రాములో...రాములా’, ‘దిమ్మాక్ ఖరాబ్’, ‘వాటేబ్యూటీ’ .. లాంటి పాటలతో ఎంతో పాపులర్ అయ్యాను. ‘చంటిగాడు’ సినిమా కోసం నేను రాసిన ఇంకోపాట ‘సిగ్గులొలికే సీతాలు..’ పాట రిలీజ్ టైమ్‌లో సినిమాలో లేదు. సినిమా పెద్ద హిట్ అయ్యాక 50 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఆ పాటను డిజిటల్‌లో షూట్ చేసి అన్ని సెంటర్స్‌లో యాడ్ చేయడం మర్చిపోలేని అనుభూతి. జయగారి సినిమాతో పరిచయమైన నేను వారి అబ్బాయి శివ దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘22’ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌తో పాటు మరో పాటను కూడా రాయడం చాలా సంతోషంగా ఉంది. శివ చాలా కూల్ పర్సన్. పని విషయంలో మాత్రం సిన్సియర్‌గా ఉండి, తాను అనుకున్న మంచి అవుట్‌పుట్ రాబట్టుకుంటారు. సాంగ్‌ను లాంచ్ చేసిన ప్రభాస్‌గారికి థ్యాంక్స్. అలాగే ‘22’ హీరో రూపేష్‌కు కృతజ్ఞతలు’’ అన్నారు.
సినిమాటోగ్రాఫర్ రవికిరణ్ మాట్లాడుతూ - ‘‘శ్యామ్‌గారు ఈ సినిమాలో రెండు మంచి పాటలు రాశారు. ఈ సాంగ్ లో తెలుగు, హిందీ లిరిక్స్‌ను బాగా మ్యాచ్ చేశారు’’ అన్నారు.
ఆర్ట్ డైరెక్టర్ పెద్దిరాజు అడ్డాల మాట్లాడుతూ - ‘‘ప్రభాస్‌గారు మా సినిమా పాటను విడుదల చేయడం సంతోషంగా ఉంది. సాయికార్తీక్ సంగీతం, కాసర్లశ్యామ్ సాహిత్యం చక్కగా కుదిరాయి. ఈ అవకావం ఇచ్చిన దర్శక-నిర్మాతలకు థ్యాంక్స్.’’
సింగర్ మ్యాడీ మాట్లాడుతూ - ‘‘నేను పాడిన పాటను ప్రభాస్‌గారు విడుదల చేయడం ఎప్పటికీ మర్చిపోలేను. ఈ పాటను నిజంగా నేను ఇంతమంచిగా పాడటానికి కారణమైన సాయికార్తీక్, లిరిక్స్ రాసిన శ్యామ్ గార్లకు ధన్యవాదాలు’’ అన్నారు.
ఫిబ్రవరి 23(ఆదివారం)ఈ చిత్ర సంగీత దర్శకుడు సాయికార్తీక్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో సాయికార్తీక్ బర్త్‌డే సెలబ్రేషన్స్ చిత్రబృందం సమక్షంలో జరిగాయి.
రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా, విక్రమ్ జీత్ విర్క్, దేవిప్రసాద్, జయప్రకాష్, రవి వర్మ, శశిధర్ కోసూరి, ఫిదా శరణ్య, రాజశ్రీనాయర్, పూజా రామచంద్రన్, కృష్ణ చైతన్య, ఆఫ్ఘనిస్తాన్ రామరాజు, బేబి సంస్కృతి, మాస్టర్ తరుణ్, మాస్టర్ దేవాన్ష్, బేబి ఓజల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : బి.వి.రవికిరణ్, సంగీతం: సాయికార్తీక్, ఎడిటింగ్: శ్యామ్ వాడవల్లి, కొరియోగ్రఫీ: అనీలామా, ఆర్ట్: పెద్దిరాజు అడ్డాల, స్టంట్స్: జాషువ, లిరిక్స్: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, ప్రొడక్షన్ మేనేజర్: కిరణ్ కాసా, పిఆర్ఓ: బి.ఎ రాజు, చీఫ్ కో-డైరెక్టర్: పుల్లారావు కొప్పినీడి, నిర్మాత: శ్రీమతి సుశీలాదేవి, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: శివకుమార్ బి.