ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మిక లక్కీ గురించే టాపిక్. వరసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ ని తక్కువ కాలంలో అందుకుంది. నిన్నగాక మొన్న సరిలేరు నీకెవ్వరు సినిమాతో హిట్ కొట్టిన రష్మిక నేడు భీష్మతో బాక్సాఫీసు వద్దకు వచ్చేసింది. నితిన్ తో కలిసి థియేటర్స్ లో సందడి చేస్తున్న రష్మిక మందన్న చేతిలో అల్లు అర్జున్ సినిమా ఉంది. అది ఇంకా పట్టాలెక్కలేదు కానీ భీష్మ సినిమా హిట్ అయితే మాత్రం అమ్మడుకి బడా ప్రాజెక్ట్ రెడీగా వుంది. అల్లు అర్జున్ సినిమానే లక్కీ అనుకుంటే ఇప్పుడు రష్మిక చెంతకు మరో లక్కీ ప్రాజెక్ట్ రాబోతుంది. కేవలం ఆ ఆఫర్ భీష్మ హిట్ మీదే ఆధారపడి ఉంటుంది అంటున్నారు.
భీష్మ సినిమాలో గ్లామర్ తో అదరగొడుతున్న రష్మిక ఈ సినిమా హిట్ తో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా ఛాన్స్ పట్టెయ్యొచ్చనే ఊహాగానాలు టాలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో మొదలయ్యాయి. ఎలాగూ భీష్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక పబ్లిక్ గానే త్రివిక్రమ్ ని తనకో ఆఫర్ ఇవ్వమని అడిగింది. ప్రస్తుతం క్రేజున్న రశ్మికకి త్రివిక్రమ్ కూడా ఛాన్స్ ఇచ్చేలా ఉన్నాడు. ఎందుకంటే నిన్నమొన్నటి వరకు గ్లామర్ డోస్ చూపించని రష్మిక భీష్మ సినిమా కోసం గ్లామర్ పరంగా 100 కి 90 మార్కులు కొట్టేసింది. చిన్న చిన్న ఫ్రాక్స్ తోనూ, మిడ్డీస్ తోనూ, షార్ట్స్ తోనూ హొయలు పోతుంది. ఎలాగూ త్రివిక్రమ్ సినిమాలకు ఇలాంటి గ్లామర్ అవసరం గనక భీష్మ హిట్ అయ్యిందా ఎన్టీఆర్ ఛాన్స్ రశ్మిక్ ఒడిలో పడినట్లే అంటున్నారు.