విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ లో జాయిన్ అయిన బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే !!!
సంచలన కథానాయకుడు విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రాబోతున్న క్రేజీ మూవీ షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్క్రిప్టుకు ఫిదా అయిన కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మాణ భాగస్వాములుగా ఈ ప్రాజెక్టులో జాయిన్ అయ్యారు.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లుక్ విషయంలో పూరి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ లో హీరోయిన్ అనన్య పాండే జాయిన్ అయ్యింది. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన అనన్య పాండే విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది. ముంబైలో ఆర్ట్ డైరెక్టర్ జాని షైక్ బాషా నిర్మించిన భారీ సెట్ లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.
పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ తో పాటు కరణ్ జోహార్, అపూర్వ మెహతా ఈ యాక్షన్ సినిమాని నిర్మిస్తున్నారు.
రమ్యకృష్ణ, రోణిత్ రాయ్, విష్ణురెడ్డి, అలీ, గెటప్ శ్రీను కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీని ధర్మా ప్రొడక్షన్స్ సమర్పిస్తోంది.
బ్యానర్: పూరి కనెక్ట్స్
సమర్పణ: ధర్మా ప్రొడక్షన్స్
నిర్మాతలు: పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహత
కెమెరామెన్: విష్ణు శర్మ
ఆర్ట్ డైరెక్టర్: జాని షైక్ బాషా
స్టంట్ మాస్టర్: కిచ
ఎడిటర్: జునైద్ సిద్దిక్