బాహుబలి సినిమాతో ప్రభాస్ నేషనల్ లెవెల్ స్టార్ అయిపోయాడు. ఐదు సంవత్సరాలు ఒకే సినిమా మీద ఉన్న ప్రభాస్ ఆ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. బాహుబలి ద్వారా వచ్చిన క్రేజ్ ని దృష్టిలో ఉంచుకుని ప్రభాస్ తన చిత్రాలన్నింటినీ పాన్ ఇండియా బేస్ట్ గా ఉండేలా చూసుకుంటున్నాడు. కథా పరంగా, కథనం పరంగా యూనివర్సల్ ఆక్సెప్టెన్సీ ఉండేలా చూసుకుంటున్నాడు. అలాంటి అన్ని లక్షణాలు ఉన్నాయన్న కారణంగానే సాహో సినిమా చేశాడు.
ఈ సినిమా బాలీవుడ్ మినహా మిగతా భాషల్లో సక్సెస్ కాలేకపోయింది. ఈ సినిమా సక్సెస్ కాలేకపోవడానికి చాలా కారణాలుండవచ్చు. ఆ కారణాలన్నింటిలో అతి ముఖ్యమైన కారణం అది మాస్ సినిమా కాకపోవడం. అవును ప్రభాస్ అభిమానులు తమ హీరోని మాస్ సినిమాల్లో చూడడానికే ఇష్టపడతారు. అందుకే మిర్చి, ఛత్రపతి లాంటి సినిమా సూపర్ సక్సెస్ అయ్యాయి. కానీ మాస్ సినిమాలో ఉండే అంశాలు సాహోలో లేకపోవడం కూడా ఈ సినిమా ఫ్లాప్ కావడానికి కారణంగా కనిపిస్తుంది.
బాహుబలి లాంటి సినిమా తీసిన తర్వాత మిర్చి వంటి మాస్ సినిమా అయితే అభిమానులు ఊగిపోయేవారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ నుండి అభిమానులు కోరుకుంటున్నదదే. మరో మిర్చి లాంటి సినిమానో, చత్రపతి వంటి సినిమానో వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. మరి తన తర్వాతి సినిమా అయినా మాస్ ప్రెక్షకులకి నచ్చేలా ఉంటుందో లేదో చూడాలి.