వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా గత ఏడాది విడుదల కావాల్సి ఉండగా హీరో గారు దర్శకుడు క్రాంతి మాధవ్ చెప్పిన క్లైమాక్స్ ని మార్చి విజయ్ దేవరకొండ తన మీద తనకున్న కాన్ఫిడెంట్ తో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా క్లైమాక్స్ ని తనకి నచ్చినట్టుగా మార్చేసాడని, అలాగే సినిమాలో క్రాంతి మాధవ్ పని కూడా విజయ్ దేవరకొండ చేసాడని తనకొచ్చిన హిట్స్ తో విజయ్ కి కాస్త ఓవరాక్షన్ పెరిగిపోయి అలా సినిమాపై తన అధిపత్యం చూపించాడని అందుకే వరల్డ్ ఫేమస్ లవర్ పోయింది అని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ప్రచారం షురూ అయ్యింది. అందుకే సినిమాకి ప్లాప్ టాక్ వచ్చినప్పటికీ దర్శకుడు క్రాంతి మాధవ్ ని ఎవరూ ఒక్క మాట కూడా అనడం లేదని అందరూ విజయ్ దేవరకొండనే తిట్టిపోస్తున్నారు. ఇక ఆ సినిమా నిర్మాత కూడా విజయ్‌ని తిట్టిన తిట్టు తిట్టకుండా దుమ్మెత్తి పోస్తున్నాడట.
అయితే సినిమా విడుదలకు ముందు పెద్దగా సినిమాని ప్రమోట్ చెయ్యని విజయ్ దేవరకొండ సినిమా విడుదలకు వారం ముందు మాత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్, రిలీజ్ ఈవెంట్ అంటూ హంగామా చేసాడు. అయితే సినిమా విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ మీడియాకి ముఖం చూపించడం మానేసాడు. సినిమా విషయం మాట్లాడాల్సి వస్తుందనో, లేదంటే పోయిన సినిమాకి బ్యాండ్ వాయించడం అవసరం లేదనుకున్నాడో కానీ విజయ్ దేవరకొండ మాత్రం వరల్డ్ ఫేమస్ లవర్ ని కనీసం సోషల్ మీడియాలో కూడా ప్రమోట్ చేయకుండా మానెయ్యడంతో ఆ సినిమా నిర్మాత లబో దిబో అంటున్నాడు. ఈ సినిమా విడుదలయ్యి ప్లాప్ టాక్ తెచ్చుకున్నా నాకేం సంబంధం లేదు. ఏడిస్తే నిర్మాతే ఏడుస్తాడు అనుకున్నాడేమో.. పూరితో ఫైటర్ సినిమా కోసం విజయ్ ముంబై చెక్కేశాడు.