‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల బొమ్మ నభా నటేష్.. ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ డూపర్ హిట్టవ్వడంతో ఇక అవకాశాల కోసం వెతుక్కోవాల్సిన పనిలేకుండా పోయింది. అంతేకాదు.. వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. నేటి యువతకు కావాల్సిన అందం, అభినయం రెండూ ఈ బ్యూటీలో ఉండటంతో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అవకాశాలు పెరగడంతో ఈ భామ రెమ్యునరేషన్ కూడా గట్టిగా పెంచేసిందని.. ఈమెను సంప్రదించాలంటే దర్శకనిర్మాతలు జంకుతున్నారని గత కొన్నిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
మరీ ముఖ్యంగా.. ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాలో చేయాలని సంప్రదించగా గట్టిగా ఇచ్చుకోవాలని కోరిందట. అయితే.. ఈ వార్తలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన ఈ బ్యూటీ క్లారిటీ ఇచ్చుకుంది. ఆ సినిమాకి నేను పారితోషికం పెంచేసినట్టుగా వచ్చిన వార్తలన్నీ ఏ మాత్రం నిజంలేదని కొట్టిపారేసింది. అంతటితో ఆగని ఈ భామ తనకున్న క్రేజ్‌కి ఎంత పుచ్చుకోవాలో తనకు బాగా తెలుసని చెప్పుకొచ్చింది. అయితే అంతే రీతిలో ఎంత ఇచ్చుకోవాలనేది కూడా నిర్మాతలకు ఇంకా బాగా తెలుసని తెలిపింది.
ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తానని.. ఇంకా పారితోషికం ఇంత ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసే స్థాయికి తాను రాలేదని చెప్పింది. అంతటితో ఆగని ఈ భామ ఫైనల్‌గా పారితోషికం ఎక్కువ అడిగేసి నిర్మాతలను ఇబ్బంది పెట్టనని.. అలాగని చెప్పేసి తక్కువ ఇస్తామంటే మాత్రం ఒప్పుకోనని అని మనసులోని మాటను బయటపెట్టింది. మొత్తానికి చూస్తే ఈ బ్యూటీకి అన్నీ బాగానే తెలుసని చెప్పుకుంటోంది. మరి నిర్మాతలు ఏ మాత్రం ఇచ్చుకుంటున్నారో.. ఆమె ఏ మాత్రం పుచ్చుకుంటుందో వారి మధ్యే ఉన్న సీక్రెట్ అన్న మాట.