నితిన్ - రష్మిక జంటగా తెరకెక్కిన భీష్మ సినిమా రేపు శుక్రవారమే విడుదల కాబోతుంది. వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. సినిమా ట్రైలర్, సాంగ్స్, రష్మిక హాట్ గ్లామర్ సినిమాకి అదనపు ఆకర్షణగా కనబడుతుంది. దానితో సినిమాపై ఆసక్తి కనబర్చడం ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే నిర్మాతకి ఏకంగా 10 కోట్లు లాభాలు రావడంతో భీష్మ సినిమాపై అందరిలో ఆసక్తి మొదలైంది. అయితే ఈ సినిమాలో హాట్ హీరోయిన్ హెబ్బా పటేల్ కూడా ఓ కీ రోల్ పోషించింది. ప్రస్తుతం అవకాశాలు లేక సోషల్ మీడియానే నమ్ముకుని హాటెస్ట్ ఫోటో షూట్స్‌తో ఇరగదీస్తున్న ఈ కుమారి నితిన్ భీష్మ సినిమాలో ఓ కీలక పాత్ర చేసింది అని తెలుసు.
కానీ ఆ పాత్ర ఎలా ఉంటుంది. సెకండ్ హీరోయిన్ మాదిరి తేలిపోతుందా? లేదంటే హెబ్బా గ్లామర్ కోసమే ఆమెని ఈ సినిమాలో పెట్టుకున్నారా? అనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. తాజాగా భీష్మ కథని మలుపు తిప్పే కీలకమైన పాత్రలో హెబ్బా పటేల్ నటించింది అని ఈ సినిమా హిట్ అయిన తర్వాత హైలెట్స్ లో హెబ్బా పాత్ర ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ప్రస్తుతం కెరీర్ డౌన్ లో ఉన్న హెబ్బా కెరియర్ కి ఈ పాత్ర మంచి హెల్ప్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పాపం సోషల్ మీడియా క్రేజ్ కూడా హెబ్బాని కాపాడలేకపోయింది. మరి హీరో నితిన్ అయినా ఆమె కెరీర్ ని ఒడ్డున పడేస్తాడేమో చూద్దాం.