అమలాపాల్ హీరోయిన్ గా పరిచయమై చాలా రోజులు అయింది. తెలుగులో చాలా తక్కువ సినిమాల్లో నటించిన అమలాపాల్ తమిళంలో చెప్పుకోదగిన సినిమాల్లో నటించింది. మొన్నటికి మొన్న ఆమె సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె సినిమా కెరీర్ అటో ఇటో ముందుకు వెళ్తూనే ఉంది. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం కొన్ని అడ్డంకులు ఏర్పడ్డాయి. అమలాపాల్ తమిళ హీరో విజయ్ ని పెళ్ళి చేసుకుంది.. ఆ తర్వాత విడాకులు కూడా తీసుకుంది.
ప్రస్తుతం ఆమె ఒంటరిగానే జీవితం కొనసాగిస్తుంది. అయితే తాజాగా ఆమె విడాకులకి సంబంధించిన ఒక టాపిక్ వైరల్ గా మారింది. హీరో విజయ్ తండ్రి విడాకుల విషయమై మాట్లాడుతూ.. అమలాపాల్, విజయ్ ల విడాకులకి కారణం తమిళ నటుడు ధనుష్ అని బాంబు పేల్చాడు. పెళ్లయ్యాక అమలాపాల్ ని సినిమాల్లోకి తీసుకొచ్చిన ధనుష్ వల్లే ఆ ఇద్దరూ విడిపోయారని చెప్పాడు. అమలాపాల్ మళ్ళీ సినిమాలు చేయడంతోనే వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని..అందువల్ల వారిద్దరి విడాకులకి ధనుషే కారణం అని చెప్పాడు..
అయితే ఈ విషయమై అమలాపాల్ ని అడగగా, ఆమె దానికి సమాధానం చెప్తూ ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇంకా ఎందుకు మాట్లాడుకోవడం..అయినా భార్యా భర్తలు విడిపోవడానికి వారిద్దరే కారణమవుతారు కానీ..ఎవరో బయట వ్యక్తి కారణమెలా అవుతారంటూ సమాధానం ఇచ్చింది. దీన్ని బట్టి చూస్తే వారిద్దరి విడాకులకి ధనుష్ కి ఎలాంటి సంబంధం లేదని క్లియర్ గా తెలుస్తుంది.