ఇండస్ట్రీలో హీరోల ఫ్యాన్స్ మధ్య వార్స్ జరుగుతుంటాయి. మా హీరో సినిమా బాగుందంటే మా హీరో సినిమా బాగుందని.. మా హీరో సినిమా ఇన్ని కోట్లు వసూలు చేసింది.. మీరెంత వసూలు చేశారంటూ ఒక హీరో అభిమానులు మరో హీరో అభిమానులకి సవాళ్ళు విసురుతుంటారు. అలాగే తమ హీరోకి సమకాలీకుడిగా కనిపించే మరో హీరో సినిమా ఫ్లాప్ అవ్వాలని బాగా గట్టిగా కోరుకుంటారు. ఈ పద్దతి తమిళ ఇండస్ట్రీలో చాలా ఎక్కువ.
తెలుగు వాళ్ళు కూడా ఈ విషయంలో ఏమీ తక్కువ తినలేదు. హీరోల అభిమానుల మధ్య రోజూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. తాజాగా విజయ్ దేవరకొండ సినిమా వరల్డ్ ఫేమస్ రిలీజ్ అయ్యి నెగెటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న విజయ్ అభిమానులు సినిమాకి నెగెటివ్ టాక్ రావడంతో ఉస్సూరుమన్నారు. అయితే ఈ నెగెటివ్ టాక్ ని నేచురల్ స్టార్ నాని అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
నాని గ్యాంగ్ లీడర్ సినిమా యావరేజ్ అవడంతో విజయ్ అభిమానులు ఆ సినిమా మీద ఎన్నీ విమర్శలు చేశారు. గ్యాంగ్ లీడర్ సినిమాని ఏకిపారేస్తూ తమ హీరోనే గొప్ప అనుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇప్పుడు విజయ్ సినిమా కూడా ఫ్లాప్ అవడంతో నాని అభిమానులు చెలరేగిపోతున్నారు. సినిమా బాలేకపోవడంతో చేసేదేమీ లేక విజయ్ అభిమానులు సైలెంట్ గా ఉండిపోతున్నారు. వరల్డ్ ఫేమస్ లవర్ ఫ్లాప్ అయినా పూరిజగన్నాథ్ తో తీసే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు.