రాజమౌళి ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణలో చాలా బిజీగా ఉన్నాడు. ఈ సంవత్సరం రెండవ అర్థభాగం తొలినాళ్ళలో విడుదల చేయాలని అనుకుని సడెన్ గా వచ్చే సంవత్సరం సంక్రాంతికి వాయిదా వేశారు. అనుకున్న సమయానికి షూటింగ్ పార్ట్ పూర్తికాలేకపోవడంతో ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే రాజమౌళి గురించి ఒక వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది.
ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాజమౌళి మరో మల్టీస్టారర్ చేయబోతున్నాడట. ఆ మల్టీస్టారర్ లో ప్రభాస్ తో పాటు మహేష్ కూడా నటిస్తున్నాడని పుకార్లు వస్తున్నాయి. అయితే ఈ వార్తలకి ఎలాంటి తలా తోకా లేదు. ఈ వార్త నిజమా కాదా అని ఒకసారి విశ్లేషిస్తే కింది విషయాలు బయటపడ్డాయి. సాధారణంగా రాజమౌళి ఒక సినిమా చేస్తున్నప్పుడు మరో సినిమా గురించి ఆలోచించడు. సినిమా చేసి విడుదల అయ్యాకనే మరో సినిమా కథ గురించి ఆలోచిస్తాడు.
ఇప్పుడే కాఅదు మొదటి నుండి రాజమౌళి అలానే చేస్తున్నాడు. అదీ గాక రాజమౌళి కథ పూర్తి చేసుకున్నాకే ఆ కథలో ఏ హీరో అయితే బాగుంటుందా అని ఆలోచిస్తాడు.. అంతే తప్ప ముందే హీరోలని అనుకుని వారికోసం కథలు తయారుచేయడు. కాబట్టి ప్రస్తుతం తెగ షికారు చేస్తున్న పుకారు వట్టి పుకారేనని, అందులో రవ్వంత కూడా నిజం లేదని తేలిపోయింది.