వరుస పరాజయాలని ఎదుర్కొంటూ తన మార్కెట్ ని అంతకంతకు పడగొట్టుకుంటున్న బాలయ్య ఈ సారి విజయం కోసం బాగా తపిస్తున్నాడు. ఎన్టీఆర్ కథానాయకుడు మొదలుకుని మొదలైన పరాజయాల పర్వం రూలర్ సినిమాతో పతాక స్థాయికి వెళ్ళింది. రూలర్ సినిమాకి కనీస వసూళ్ళు రాకపోవడమే కాదు ఆ సినిమాలో బాలయ్య గెటప్ మీద కూడా అనేక విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు వీటన్నింటి గురించి ఆలోచిస్తూ తనని తాను మార్చుకునే పనిలో ఉన్నాడట బాలయ్య..
బాలయ్య గతంలో ఏ సినిమా కోసమైనా ఎక్కువ టైమ్ వేస్ట్ చేయడు. సినిమా కథ నచ్చిందంటే వెంటనే పట్టాలెక్కిస్తాడు.. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో వస్తున్న సినిమా విషయంలో కంగారు పెట్టట్లేదట. అంతే కాదు సినిమా ఖర్చు విషయంలో కూడా ఇంత కావాలి..అంత కావాలి అని పట్టుబట్టకుండా నిర్మాత మేలు కొరకు ఆలోచించి, తక్కువ బడ్జెట్ లో చిత్రీకరించాలనే ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం బాలయ్య బోయపాటి స్క్రిప్టు కోసం వెయిట్ చేస్తున్నాడు. గతంలో నాలుగు నెలల టైమ్ అడిగితే ఇవ్వకుండా వేరే సినిమాని మొదలెట్టిన బాలయ్య..ఇప్పుడు బోయపాటికి కావాల్సినంత సమయం ఇచ్చాడట.
వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కే ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందట. ఒకవేళ దసరా మిస్ అయితే డిసెంబర్ లో విడుదల చేయాలని భావిస్తున్నారట.