Advertisementt

విజయ్ సినిమాలో అనసూయ.. లక్కీ చాన్స్!

Tue 18th Feb 2020 01:58 PM
anasuya,anchor anasuya,vijay devarakonda,vijay movie  విజయ్ సినిమాలో అనసూయ.. లక్కీ చాన్స్!
Anasuya In Vijay Devarakonda Movie! విజయ్ సినిమాలో అనసూయ.. లక్కీ చాన్స్!
Advertisement
Ads by CJ

బుల్లితెరపై.. వెండి తెరపై ఓ వెలుగు వెలుగుతున్న యాంకర్ అనసూయ. ఏ మాత్రం చిన్న అవకాశం వచ్చినా సరే సినిమాలను అస్సలు వదులుకోవట్లేదు. మరీ ముఖ్యంగా ‘రంగస్థలం’ రంగమ్మత్త క్యారెక్టర్‌ తన దాకా వచ్చినప్పట్నుంచి ఏ పాత్రలోనూ తాను చేయననే కండిషన్స్ లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పంపుతోంది. ఇప్పటికే సోలో అనగా లేడీ ఓరియంటల్ సినిమాలు చేసినప్పటికీ కలిసిరాకపోవడంతో.. అస్సలు ఎలాంటి పాత్ర వచ్చినా చేయడానికి రెడీగా ఉంది. అటు బుల్లితెర.. ఇటు వెండితెరపై దుమ్ముదులిపేస్తోంది.

ఈ మధ్య బన్నీ-సుక్కు సినిమాలో ఈ హాట్ భామ ఓ మంచి పాత్ర చేస్తోందని టాక్ నడిచింది. ఆ తర్వాత నిన్న మొన్నటి వరకూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ‘పింక్’ సినిమాలో చేస్తోందని.. అంతేకాదు పవన్- క్రిష్ మూవీలో బంధిపోటుగా చేస్తోందని కూడా పుకార్లు షికార్లు చేశాయి. అయితే తాజాగా.. రౌడీ విజయ్ దేవర కొండ సినిమాలో లక్కీ చాన్స్ వచ్చిందని సమాచారం. ఈ సినిమాలో లేడీ విలన్‌గా అవతారమెత్తబోతుందని ఫిల్మ్‌నగర్ టాక్. విజయ్ సినిమాలో అంటే విజయ్ హీరోగా నటిస్తున్న సినిమాలో కాదండోయ్.. విజయ్ నిర్మిస్తున్న సినిమా అట. 

ఇప్పటికే ‘మీకు మాత్రమే చెప్తా’ చిత్రంలో అనసూయ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అను నటనకు ఫిదా అయిన విజయ్.. తన తదుపరి సినిమాలోనూ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. నెక్స్ట్ సినిమాలో ఈ హాట్ యాంకర్ విలన్‌గా నటించనుందట. అయితే ఈ ప్రతినాయకురాలికి నాయకుడు ఎవరు..? అసలు ఆ సినిమాను డైరెక్ట్ చేసేదెవరు..? అనే విషయాలు అధికారికంగా తెలియరాలేదు. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.

Anasuya In Vijay Devarakonda Movie!:

Anasuya In Vijay Devarakonda Movie!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ