హర్భజన్ సింగ్ హీరోగా నటిస్తోన్న ‘ఫ్రెండ్ షిప్’ చిత్రంలో కీలక పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్.
తన స్పిన్ బౌలింగ్‌తో టీమ్ ఇండియాకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించడంలో విశేష కృషి చేసిన ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్ తన సుదీర్ఘ క్రికెట్ జీవితానికి గుడ్ బై చెప్పి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్దం అయ్యారు. పలు కంపెనీలను ప్రమోట్ చేయడం కోసం కెమెరా ముందుకు వచ్చిన హర్భజన్ సింగ్ ఈసారి ‘ఫ్రెండ్ షిప్’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. తమిళ బిగ్ బాస్ ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి జాన్ పాల్ రాజ్, శ్యామ్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. సీన్‌టొ స్టూడియోస్, సినీ మాస్ స్టూడియోస్ పతాకాలపై జెపిఆర్ మరియు స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నట్టు తెలిపింది చిత్ర యూనిట్.
ఈ చిత్రాన్ని పలు భారతీయ భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమాలోని ఇతర నటీనటులు. సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. వేగంగా చిత్రీకరణ పూర్తి చేసి ఏడాది సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయనుంది చిత్ర యూనిట్.
హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్, లోస్లియా మరియనేసన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వేల్‌మురుగన్, రాబిన్, ప్రొడ్యూసర్స్: జెపిఆర్ & స్టాలిన్, దర్శకత్వం: జాన్ పాల్ రాజ్, శ్యామ్ సూర్య.