చిన్న స్టోరీ లైన్ చెప్పి మహేష్ లాంటోడిని పడేసిన అనిల్ రావిపూడి లక్కు మాములుగా లేదు. ఎఫ్ 2 తో అనుకోకుండా బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్ కి మహేష్ తగిలాడు. మహేష్ తోనూ సరిలేరు నీకెవ్వరు అనే సాదా సీదా సినిమా చేసి హిట్ కొట్టేసాడు. మహేష్ క్రేజ్ అనిల్ రావిపూడిని ఆదుకుంది. ఇక అనిల్ రావిపూడికి ఈసారి హీరోలు అంత తొందరగా పడేలా కనిపించడం లేదు. ఎందుకంటే సరిలేరు సూపర్ బ్లాక్ బస్టర్ అయితే అనిల్ ఇంటి చుట్టూ హీరోలు తిరిగేవారు. కానీ అక్కడ ఆ సీన్ కనిపించడం లేదు. ప్రస్తుతం తనకి కలిసొచ్చిన ఎఫ్ 2 సీక్వెల్ పై కూర్చున్న అనిల్ రావిపూడి ఇండస్ట్రీలో చిరు, ఎన్టీఆర్ లను డైరెక్ట్ చెయ్యాలనే కోరిక ఉందని చెబుతున్నాడు.
అది త్వరలోనే నెరవేరుతుంది అంటున్నాడు అనిల్ రావిపూడి. చిరు ఏకంగా సరిలేరు ఈవెంట్ లో అనిల్ రావిపూడి మేకింగ్ స్టయిల్ నచ్చినట్లుగా చెప్పాడు. అందుకే చిరు సై అంటే కేవలం మూడు నెలల్లోనే స్టోరీ రెడీ చేసి చిరు ముందు ఉంటానంటున్నాడు. మరోపక్క కళ్యాణ్ రామ్ ద్వారా ఎన్టీఆర్ ని పట్టేయ్యాలనే కలలు కంటున్నాడు అనిల్ రావిపూడి. పటాస్ సినిమాతో కళ్యాణ్ రామ్ కెరీర్ ని గాడిలో పెట్టిన అనిల్ రావిపూడి అడిగితే కళ్యాణ్ రామ్ కాదనడు. కాబట్టి అనిల్ రావిపూడి ఎన్టీఆర్ ఇమేజ్ కి తగిన కథ తెస్తే తానే ఆ సినిమాని నిర్మిస్తాడు. కానీ అనిల్ చిన్న లైన్ తో ఎన్టీఆర్ ని అయితే టెంప్ట్ చెయ్యలేడు. మధ్యన ఎన్టీఆర్ ఆచి తూచి సినిమాలు చేస్తున్నాడు. మరి చిరు, ఎన్టీఆర్ అంటూ అనిల్ అనుకోవడమేనా లేదంటే హీరోలకు అనిల్ మీద కన్ను ఉందా అనేది తెలియాలి.