Advertisementt

మూవీ రిలీజ్ కాకుండానే అవార్డులు ఇచ్చుకోండి!

Mon 17th Feb 2020 06:28 PM
kangana ranaut,rangoli,karan johar,film fare awards  మూవీ రిలీజ్ కాకుండానే అవార్డులు ఇచ్చుకోండి!
Issue in bollywood film fare awards మూవీ రిలీజ్ కాకుండానే అవార్డులు ఇచ్చుకోండి!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్లు మొహం మీదే చెప్పేసే వాళ్లలో ఇద్దరు సిస్టర్స్ కి చాలా ప్రత్యేకత ఉంది. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, రంగోళి తరచుగా బాలీవుడ్ బడా మనుషులపై అనేక వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా కంగనా సోదరి రంగోళి కరణ్ జోహార్ ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసింది. తాజాగా బాలీవుడ్ లో ఫిల్మ్ ఫేర్ అవార్డులని ప్రకటించారు. ఆ అవార్డుల్లో గల్లీ బాయ్ చిత్రం ఏకంగా పదమూడు అవార్డులను గెలుచుకుంది.

 

ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒక్క సినిమాకే అన్ని అవార్డులు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ అవార్డుల జ్యూరీ మెంబర్ గా కరణ్ జోహార్ ఉండడంతో రంగోళి కరణ్ జోహార్ ని టార్గెట్ చేసింది. కరణ్ జోహార్ లాంటి వాళ్ళు జ్యూరీ మెంబర్లు గా ఉంటే ఒక్క సినిమాకి ఎన్ని అవార్డులైనా ఇచ్చుకుంటారని, అవసరమైతే ఆయన నిర్మాణంలో ఉండి, ఇంకా విడుదల కాని తఖ్త్ సినిమాకి కూడా అవార్డు ఇచ్చుకోవాల్సింది అంటూ పంచ్ వేసింది.

 

ఇక ముఖ్యంగా ఉత్తమ నటిగా ఆలియాకి అవార్డు రావడం రంగోళికి అస్సలు నచ్చలేదు. మణికర్ణిక సినిమాలో కంగనా ఎంతో బాగా నటించినా అవార్డు ఇవ్వకపోవడంతో ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఫేక్ అని తేలిపోయిందని చెప్పింది. ఏది ఏమైనా గల్లీబోయ్ సినిమాకి పదమూడు అవార్డులు ఇవ్వడంతో రంగోళి చెప్తున్న విషయాలు నిజమేనేమో అన్న అనుమానాలు కలుగక మానదు.

Issue in bollywood film fare awards:

bollywood queen rangoli comments on Karan Johar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ