Advertisementt

ఎన్టీఆర్‌తో.. ఎందుకింత ఆరాటం కళ్యాణ్‌రామ్‌?

Mon 17th Feb 2020 10:16 PM
kalyan ram,movie,jr ntr,rrr  ఎన్టీఆర్‌తో.. ఎందుకింత ఆరాటం కళ్యాణ్‌రామ్‌?
Kalyan Ram Wants Movie with Jr NTR ఎన్టీఆర్‌తో.. ఎందుకింత ఆరాటం కళ్యాణ్‌రామ్‌?
Advertisement
Ads by CJ

కళ్యాణ్ రామ్ ఒకప్పుడు తమ్ముడు ఎన్టీఆర్ కి దూరంగానే ఉండేవాడు. కానీ హరికృష్ణ అనారోగ్యం వలన కళ్యాణ్ రామ్ తమ్ముడు ఎన్టీఆర్ ని ఆదరిస్తున్నాడు. ఇక అటు నందమూరి ఫ్యామిలితోనూ, ఇటు ఎన్టీఆర్ తోనూ సఖ్యతగా ఉంటున్నాడు. తండ్రి హరికృష్ణ మరణంతో ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ బంధం మరింతగా దృఢపడింది. అయితే కళ్యాణ్ రామ్ బాగా అప్పుల్లో కూరుకుపోయినప్పుడు అన్న కోసం ఎన్టీఆర్ జై లవ కుశ సినిమా చేసాడు. దానితో కళ్యాణ్ రామ్ ఒడ్డున పడ్డాడు. మరోపక్క హీరోగా కళ్యాణ్ రామ్ కి కలిసిరావడం లేదు. అలాగే నిర్మాతగానూ వరసగా ఫెయిల్ అవుతున్నాడు. అందుకే మరోసారి ఎన్టీఆర్ తో సినిమా కోసం కళ్యాణ్ రామ్ ప్రయత్నాలు మొదలెట్టాడు. RRR తర్వాత త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ చెయ్యబోయే సినిమాలో హరిక హాసినితో కలిసి వాటా పంచుకుందామనుకుంటే.. త్రివిక్రమ్ పడనివ్వడం లేదు.

తర్వాత అట్లీ తోనూ, కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమాలు పట్టాలెక్కేలా ఉన్నాయి. అయితే కళ్యాణ్ రామ్ మాత్రం తమ్ముడు ఎన్టీఆర్ తో సినిమా కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసాడని, అందుకే తమ్ముడు కోసం కథలు ప్రిపేర్ చెయ్యమని కొంతమంది దర్శకులకి కళ్యాణ్ రామ్ ఫోన్స్ చేసినట్లుగా ఓ న్యూస్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ కి త‌గిన క‌థ చెప్ప‌మ‌ని, త‌న‌కు బాగా ప‌రిచ‌యం ఉన్న ఓ ద‌ర్శ‌కుడిని కళ్యాణ్ రామ్ కలిసి అడిగిన‌ట్టు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ కి భారీగా పారితోషకం ఇచ్చేకన్నా లాభాల్లో వాటిని సగం సగం పంచుకోవాలని కళ్యాణ్ రామ్ చూస్తున్నాడట. అయితే కళ్యాణ్ రామ్ ఆరాటం చూసాక ఇదంతా తమ్ముడి కోసమా... లేదంటే మారేదన్నానా అంటున్నారు.

Kalyan Ram Wants Movie with Jr NTR:

Kalyan Ram Waiting for Movie with Young Tiger

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ