పెళ్లి చూపులు సినిమా హిట్ తర్వాత విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుకున్నారు కానీ ఓ అవకాశాలు ఇచ్చేంతగా అయితే కాదు. కానీ అర్జున్ రెడ్డి సినిమాని సందీప్ వంగతో తెరకెక్కించినా అనుమానంతోనే ఆ సినిమాని విడుదల చేసారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో విజయ్ వెనుక దర్శక నిర్మాతలు పడ్డారు. తర్వాత ద్వారకా, టాక్సీవాలా, నోటా మరియు వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి సినిమాలకు విజయ్ ఆలోచన లేకుండా కమిట్మెంట్స్ ఇచ్చేసాడు. ఆ సినిమాలకు కమిట్ అవడం వాటిని చెయ్యడం ప్లాప్స్ కొట్టడం జరిగాయి. మధ్యలో గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ ఉండడంతో విజయ్ దేవరకొండ నటుడిగా మరింత క్రేజ్ సంపాదించాడు.
అయితే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాల తర్వాత ఎడాపెడా కమిట్ అయిన చిత్రాలను విజయ్ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా వరకు పూర్తి చేసి పారేసాడు. ఇష్టమున్నా లేకపోయినా విజయ్ వాటిని పర్ఫెక్ట్ గా చేసాడు. కానీ అవి ప్రేక్షకులకు రీచ్ కాలేకపోయాయి. ఇక విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తర్వాత ఎటువంటి కమిట్మెంట్స్ ఎవ్వరికి ఇవ్వలేదు. దిల్ రాజు లాంటోడు దర్శకుడు శివ నిర్వాణతో విజయ్ సినిమా అంటూ ప్రకటించినా అది ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేదు.
ఇక ప్రస్తుతానికి ఎటువంటి కమిట్మెంట్స్ లేని విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ తో కలిసి కూల్ గా ఫైటర్(వర్కింగ్ టైటిల్) సినిమా షూట్ లో పాల్గొంటున్నాడు. డియర్ కామ్రేడ్ ఇంట్రెస్ట్ గా ప్రమోషన్ చేసినా వరల్డ్ ఫేమస్ లవర్ కి శాయశక్తులా ప్రమోట్ చేసినా ఫలితం దక్కలేదు. కాబట్టి ఇక విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ కమిట్మెంట్స్ విషయంలో తొందరపడకూడదని డిసైడ్ అయ్యాడట.