హీరో నితిన్ త్వరలో వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నాడు. శాలిని అనే యువతిని పెళ్లి చేసుకొనేందుకు సిద్ధమవుతున్నాడు. దుబాయ్‌లో ఏప్రిల్ 16న జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్‌లో శాలిని మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు నితిన్. కాగా శనివారం హైదరాబాద్‌లోని నితిన్ ఇంట్లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ‘పసుపు కుంకుమ’ కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను తన ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసిన్ నితిన్ ‘పెళ్లిపనులు మొదలయ్యాయి. మ్యూజిక్ మొదలయ్యింది. మీ ఆశీర్వాదం కావాలి’ అని పోస్ట్ చేశాడు. ఏప్రిల్ 15న నిశ్చితార్థం, 16న పెళ్లి జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. కాగా నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘భీష్మ’ ఫిబ్రవరి 21న విడుదలవుతోంది.