Advertisementt

హీరో కాకపోతే.. సైంటిస్ట్ అయ్యేవాడంట!

Sun 16th Feb 2020 06:43 PM
allu arjun,interview,scientist,hero,bunny  హీరో కాకపోతే.. సైంటిస్ట్ అయ్యేవాడంట!
Allu Arjun Latest Interview Updates హీరో కాకపోతే.. సైంటిస్ట్ అయ్యేవాడంట!
Advertisement
Ads by CJ

గంగోత్రి సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. గంగోత్రికి - అల వైకుంఠపురములో మధ్య హిట్స్ ప్లాప్స్ చూసిన  అల్లు అర్జున్ అసలు హీరో అవ్వాలని అనుకోలేదట. తన చిన్నప్పటి నుండి నిలకడలేని ఆలోచనలతో ఉన్న అల్లు అర్జున్ కెరీర్ పరంగా రకరకాలుగా ఆలోచించాడట. మొదట్లో అల్లు అర్జున్ మ్యూజికల్‌గా పియానో టీచర్ అవుదామనుకున్నాడట. తర్వాత మార్షల్ ఆర్ట్స్ టీచర్ అవుదామని కూడా అనుకున్నాడట. తర్వాత యానిమేటర్ గానో విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ గానో అవుదామని అనుకున్నాడట.

ఆఖరుకి నాసాలో సైంటిస్ట్ గా మారాలనుకున్నాడట. ఇలా రకరకాల ఆలోచనలు చేసిన అల్లు అర్జున్ కి చివరికి 18 ఇయర్స్ అప్పుడు మాత్రం హీరోగా మారి సక్సెస్ అవ్వాలని కలలు కన్నాడట. మరి తండ్రి సినిమాల్లో సూపర్ నిర్మాత అందుకే అలా అల్లు అర్జున్ హీరో అవ్వాలనుకోవడంలో తప్పులేదు. మరి భారీ బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన అల్లు అర్జున్ మాత్రం స్వశక్తితో ఎదిగాడు. అందుకే టాప్ డైరెక్టర్స్ తో టాప్ సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ కొడుతున్నాడు. మరి అల వైకుంఠపురములో సినిమా హిట్ అయ్యాక సుకుమార్ తో సినిమా మొదలెట్టాడు అల్లు అర్జున్.

Allu Arjun Latest Interview Updates:

Allu Arjun inner Feeling out an interview

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ