Advertisementt

ఈ ఒక్క సినిమాతో పేరు మొత్తం పోయింది

Sun 16th Feb 2020 03:27 PM
love aaj kal,sara ali khan,bollywood,romantic,box office report  ఈ ఒక్క సినిమాతో పేరు మొత్తం పోయింది
love aaj kal Report at Box Office ఈ ఒక్క సినిమాతో పేరు మొత్తం పోయింది
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో యంగ్ హీరో హీరోయిన్ కార్తీక్ ఆర్యన్ - సారా అలీఖాన్ జంటగా నటించిన లవ్ ఆజ్ కల్ నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2009లో లవ్ ఆజ్ కల్ సినిమాకు రీమేక్ గా ఇంతియాజ్ అలీ ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు. మొదటి నుండి కార్తీక్ ఆర్యన్ - సారాలు సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన లవ్ ఆజ్ కల్ పై ప్రేక్షకుల్లో మంచి ఇంట్రెస్ట్ ఉంది. కానీ లవ్ ఆజ్ కల్ ట్రైలర్ తర్వాత ప్రేక్షకుల్లో ఆ సినిమాపై ఆసక్తి కన్నా ఎక్కువగా అనుమానం మొదలయ్యింది. ఆ సినిమా ట్రైలర్ చూసిన చాలామంది తాము సినిమాని చూడమంటే చూడమన్నారు. ఈ సినిమాలో బూతు కంటెంట్ భీభత్సంగా ఉందని... అసలు ఇంతియాజ్ అలీ ఇలాంటి సినిమాని ఎలా డైరెక్ట్ చేసాడని అన్నారు.

మరి ట్రైలర్ చూస్తే అలా ఫీలయిన ప్రేక్షకులు సినిమా చూసి వాంతులు చేసుకుంటున్నారని అంటున్నారు. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ కాస్త ఓవర్ అయ్యాయి. అంతేకాకుండా కిస్సింగ్ సీన్స్ మరీ రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని... సినిమా విడుదలకు ముందే సెన్సార్ బోర్డు సినిమాకి కత్తెర్లు అలాగే అసభ్యకరమైన పదాలు బీప్ చేయాలని ఆర్డర్ వేసింది. ఇక సినిమాలో సారా అలీఖాన్ ఓవరాక్షన్ భరించలేకపోయామని సినిమాలో కార్తిక్ ఆర్యన్ తప్ప మిగతాదేది చూసే విధంగా లేదని అసలు ఈ సినిమాని ఎలా తీశారో అంటూ సినిమాపై మీమ్స్ వేసి సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ పెడుతున్నారు. ఈమధ్యనే కెరీర్ స్టార్ట్ చేసిన సారా అలీఖాన్ మంచి హీరోలతోనూ, డైరెక్టర్స్ తోనూ, మంచి కంటెంట్ ఉన్న సినిమాలే చేసి పేరు తెచ్చుకుంది. కానీ ఈ లవ్ ఆజ్ కల్ తో వచ్చిన పేరు మొత్తం సారా పోగొట్టుకుందనిపిస్తుంది.

love aaj kal Report at Box Office:

Heavy romance scenes in love aaj kal Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ