Advertisementt

గోల్డ్ మెడల్ కొట్టిన గణేష్ ఎంబారి!

Sun 16th Feb 2020 03:19 PM
deverakonda foundation,help,kick boxer,ganesh embari  గోల్డ్ మెడల్ కొట్టిన గణేష్ ఎంబారి!
Ganesh Embari Wins Gold Medal గోల్డ్ మెడల్ కొట్టిన గణేష్ ఎంబారి!
Advertisement
Ads by CJ

దేవరకొండ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో గోల్డ్ మెడల్ సాధించిన కిక్ బాక్సర్ గణేష్ ఎంబారి

హీరో విజయ్ దేవరకొండ స్థాపించిన ‘‘దేవరకొండ ఫౌండేషన్’’ చేసిన చిన్న ఆర్థిక సహాయం ఓ యువ క్రీడాకారుడి కెరీర్ కు దోహదపడింది. మెదక్ జిల్లాకు చెందిన కిక్ బాక్సర్ గణేష్ ఎంబారి న్యూఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ కి పోటీపడుతున్నాడు. కానీ అక్కడ పాల్గొనేందుకు కావాల్సిన ఫీజ్ కోసం ఇబ్బంది పడుతున్నాడు. ఫ్యాన్స్ ద్వారా విషయం తెలుసుకున్న హీరో విజయ్ తమ ‘‘దేవరకొండ ఫౌండేషన్’’ నుండి ఆ పార్టిసిపేషన్ ఫీజ్ 24 వేలు ఆర్థిక సహాయం చేశారు. ఫిబ్రవరి 1న ఆ చెక్ ను దేవరకొండ గోవర్ధన్ రావు క్రీడాకారుడు గణేష్ కు అందజేశారు.

ఆ సహాయంతో న్యూడిల్లీ వెళ్ళిన గణేష్ ఈ నెల 13న జరిగిన పోటీలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించాడు. యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే హీరో విజయ్ చేసిన ఆ సహాయం వల్లే తాను ఆ పోటీల్లో పార్టిసిపేట్ చేయగలిగి, గోల్డ్ మెడల్ సాధించాననీ గణేష్ ఎంబారి సంతోషం వ్యక్తం చేశాడు. 

Ganesh Embari Wins Gold Medal :

Deverakonda Foundation helps kick boxer Ganesh Embari

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ