Advertisementt

‘కృష్ణ అండ్ హిజ్ లీల’ టీజర్ వదిలిన వెంకీ

Sat 15th Feb 2020 09:16 PM
krishna and his leela movie,teaser,venkatesh,suresh productions  ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ టీజర్ వదిలిన వెంకీ
Krishna and His Leela Movie Teaser Released ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ టీజర్ వదిలిన వెంకీ
Advertisement
Ads by CJ

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రానా దగ్గుబాటి సమర్పిస్తోన్న చిత్రం ‘కృష్ణ అండ్ హిజ్ లీల’. గుంటూర్ టాకీస్ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న ఈ మూవీని ‘క్షణం’తో డైరెక్టర్‌గా పరిచయమై సంచలనం సృష్టించిన రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్నారు. వేలంటైన్స్ డే సందర్భంగా ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ టీజర్ ను హీరో విక్టరీ వెంకటేష్ శుక్రవారం ఆవిష్కరించారు. ఒక సమకాలీన అంశంతో ఈ టీజర్ ఆసక్తి కలిగిస్తోంది. ‘క్షణం’తో పోలిస్తే తన రెండో సినిమాను ఒక డిఫరెంట్ స్టోరీతో రవికాంత్ రూపొందిస్తున్నారు. సరికొత్త కథనంతో మ్యాజిక్ చెయ్యడం ఆయన బలం.

రాంగ్ టైమ్ రిలేషన్ షిప్స్‌తో సమస్యల్లో చిక్కుకొనే యువకుడిగా ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ కనిపించనున్నాడు. శ్రీకృష్ణ పరమాత్ముడి తరహాలో పలువురు భామలతో అతను సరసాల్లో మునిగితేలుతుంటాడు. హీరోయిన్లుగా శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, శాలిని వడ్నికత్తి నటిస్తున్నారు. సబ్జెక్టుకు తగ్గ మ్యూజిక్‌ను శ్రీచరణ్ పాకాల అందిస్తున్నారు. హీరో క్యారెక్టరైజేషన్ తెలిపే విధంగా ‘పులిహోర కలిపెనులే’ అంటూ వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ నవ్విస్తుంది. ఈ ‘పులిహోర’ ట్రాక్ ను హేమచంద్ర రచించి పాడారు. సమాజంలో వైరల్ అయిన రూమర్స్ ఆధారంగా ఈ కథను రవికాంత్ రాయడం గమనార్హం. మే 1న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

 

ప్రధాన తారాగణం:

సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, శాలిని వడ్నికత్తి

 

సాంకేతిక బృందం:

రచన: రవికాంత్, సిద్ధు

మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల

‘పులిహోర’ ట్రాక్ రచన, గానం: హేమచంద్ర

సినిమాటోగ్రఫీ: షానీల్ డియో, సాయిప్రకాష్ యు.

ప్రొడక్షన్ డిజైన్: రవి ఆంథోని

దర్శకత్వం: రవికాంత్ పేరెపు

బ్యానర్స్: సురేష్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్

Krishna and His Leela Movie Teaser Released:

Victory Venkatesh Launches Krishna and His Leela Movie Teaser

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ