ఈ మాటన్నది ఎవరో కాదు.. యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ. ట్రోల్స్ చేస్తుంటే నెటిజెన్స్ మన గురించి ఆలోచిస్తున్నట్టే కదా అంటున్నాడు. డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్ దేవరకొండ మీద సోషల్ మీడియాలో నడిచిన ట్రోల్స్ ఏ హీరో మీద నడవలేదు. అప్పుడు దేవరకొండ యాటిట్యూడ్ కి ప్రేక్షకులు విజయ్ దేవరకొండ ని టార్గెట్ చేసారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫెమస్ లవర్ ఈ రోజు విడుదలైంది. ఇంకా టాక్ బయటికి రాలేదు కానీ.. సినిమాపై మాత్రం విజయ్ దేవకొండ గత సినిమాల క్రేజ్, ఆసక్తి జనాల్లో కనిపించడం లేదు. భారీ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన విజయ్ దేవరకొండ.. ఆ సినిమా ప్రమోషన్స్ లో చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
అందులో భాగంగా మీ మీద వస్తున్న ట్రోల్స్ కి మీ సమాధానం ఏమిటి అని మీడియా అడిగిన ప్రశ్నకి విజయ్ దేవరకొండ తడుముకోకుండా ఘాటైన సమాధానం చెప్పాడు. ట్రోల్స్ అంటే చాలా ఇష్టమట. అలా ట్రోల్స్ అంటూ ప్రతి ఒక్కరు నా గురించి మాట్లాడుకోవడం చూసి చాలా ఎంజాయ్ చేస్తా అని... నెటిజెన్స్ తమ ఇంపార్టెంట్ టైం ని వినియోగించి నా గురించి, నా స్టయిల్ గురించి, నా సినిమాల గురించి మీమ్స్ తయారు చేసి నన్ను విపరీతంగా ప్రమోట్ చేయడం చూస్తే చాలా సంతోషం అని చెబుతున్నాడు. సన్ను ట్రోల్స్ చేస్తూ ఉండే వాళ్ళకి నిద్రలేని రాత్రులు ఇస్తున్నాను. అంటే కలలో కూడా వాళ్ళు నన్నే తలచుకుంటారు అంటూ విజయ్ చెప్పిన సమాధానంతో అందరూ షాకయ్యారు. మరి విజయ్ చెప్పిన మరో మాట వింటే నోళ్లు వెళ్ళబెట్టాల్సిందే. అదేమంటే విజయ్ ఇండియన్ సినిమాని రూల్ చెయ్యాలనుకుంటున్నానని చెబుతున్నాడు.