Advertisementt

వేలెంటైన్స్ డే సందర్భంగా ‘14’ ఫస్ట్ లుక్!

Sat 15th Feb 2020 03:19 PM
‘14’ movie,first look motion poster  వేలెంటైన్స్ డే సందర్భంగా ‘14’ ఫస్ట్ లుక్!
‘14’ Movie First Look Motion Poster Is Unveiled On February 14 వేలెంటైన్స్ డే సందర్భంగా ‘14’ ఫస్ట్ లుక్!
Advertisement
Ads by CJ

రాయల్ పిక్చర్స్ పతాకంపై నోయెల్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న‌ చిత్రం ‘14’. లక్ష్మిశ్రీనివాస్ ద‌ర్శకత్వంలో సుబ్బారావ్ రాయన, శివకృష్ణ నిచ్చెన మెట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. వైవిద్యభరితమైన ఈ చిత్రంలో రతన్, విశాఖ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ ఆచార్య, మహేష్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 14 వేలెంటైన్స్ డే కానుకగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ విడుదల చేశారు. 

ఈ సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ.. ‘ఈ మోషన్ పోస్టర్ చాలా కొత్తగా ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంది. ఈ పోస్టర్ లాగే సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది అనుకుంటున్నాను. నోయల్ కి ‘కుమారి 21ఎఫ్’ సినిమాకన్నా ఎక్కువ పేరు రావాలని ఆశిస్తున్నాను. టీమ్ అంద‌రికీ నా బెస్ట్ విషెస్‌’ అన్నారు.

దర్శకుడు లక్ష్మిశ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘కొత్త పాయింట్ ని ఎప్పుడు తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంతో మీ ముందుకు వస్తున్నాం. త‌ప్ప‌కుండా  మా చిత్రం మంచి విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది’ అన్నారు.

నోయెల్ సీన్, రతన్, వైశాఖ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ ఆచార్య, మహేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయినాథ్, సంగీతం: ఎర్త్ సౌండ్స్, ఎడిటర్: జానకిరామ, స్టంట్స్: డ్రాగన్ ప్రకాష్, మాటలు: ఆదిత్య భార్గవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కామిరెడ్డి బాబురెడ్డి, నిర్మాతలు: సుబ్బారావ్ రాయన, శివకృష్ణ నిచ్చెన మెట్ల, రచన- దర్శకత్వం : లక్ష్మిశ్రీనివాస్.

‘14’ Movie First Look Motion Poster Is Unveiled On February 14:

‘14’ Movie First Look Motion Poster Is Unveiled On February 14  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ