Advertisementt

ఫిబ్రవరి 28న ‘రాహు’ గ్రాండ్ రిలీజ్

Fri 14th Feb 2020 07:02 PM
rahu movie,release,feb 28th,tollywood  ఫిబ్రవరి 28న ‘రాహు’ గ్రాండ్ రిలీజ్
Rahu Release On Feb 28th ఫిబ్రవరి 28న ‘రాహు’ గ్రాండ్ రిలీజ్
Advertisement
Ads by CJ

కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకున్న రాహు ఫిబ్రవరి 28 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తన గాత్రం తెలుగు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తున్న సిధ్ శ్రీరామ్ పాడిన ‘ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ నీతోటి నే సాగగా.. పాదాలూ దూరాలు మరిచాయి ఒట్టూ మేఘాల్లో ఉన్నట్టుగా.. ఏమో ఏమో ఏమో’ పాట ‘రాహు’కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సిధ్ శ్రీరామ్ గానం చేసిన ఈ పాట హాంటింగ్ సాంగ్ అనిపించుకుంటోంది. రాహు శాటిలైట్, డిజిటిల్ హాక్కులు జి తెలుగు సొంతం చేసుకోవడం ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచింది.

ఈ సందర్భంగా దర్శకుడు సుబ్బు వేదుల మాట్లాడుతూ.. ‘ ఇదో థ్రిల్లర్ మూవీ. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్ లో ఉండబోతుంది.ప్రవీణ్ లక్కరాజు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రాహుకి అసెట్‌గా మారింది. కృతి గార్గ్, అభిరామ్ వర్మ ల నటన కు ప్రత్యేక ప్రశంసలు దక్కుతాయి. థ్రిలర్స్  తెలుగులో కొత్త  ట్రెండ్ ని సెట్ చేస్తున్నాయి. రాహు వాటి సరసన నిలబడుతుంది అని కాన్ఫిడెంట్‌గా మా టీం ఉంది. ఈ చిత్రాన్ని గ్రాండ్ గా ఫిబ్రవరి 28న సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల చేస్తున్నాం’ అన్నారు.

 

న్యూ ఎజ్ థ్రిలర్ గా రాబోతున్న రాహు చిత్రంలో కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నికలు నటిస్తున్నారు.

టెక్నికల్ గా అత్యున్నతంగా ఉండబోతోన్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం- సుబ్బు వేదుల

నిర్మాతలు - ఏ వి

ఆర్ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల

డిఓపి - సురేష్ రగుతు ,ఈశ్వర్ యల్లు మహాంతి,

మ్యూజిక్ - ప్రవీణ్ లక్కరాజు

ఎడిటింగ్ - అమర్ రెడ్డి

పి ఆర్ ఓ : జీ యస్ కే మీడియా

Rahu Release On Feb 28th:

Rahu Release On Feb 28th  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ