మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 బిగ్గెస్ట్ హిట్ అవడంతో.. ఇష్టపడి ‘సైరా’ మూవీ చేసాడు. కానీ చిరు అనుకున్న హిట్ మాత్రం అది అవలేదు. అయితే చిరు స్టామినాతో తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ అయ్యింది. మెగాస్టార్ మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఆచార్య కోసం టాప్ డైరెక్టర్ కొరటాల శివాతో కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు మెగాస్టార్ మరియు కొరటాలా ఇద్దరి క్రేజ్ తో ఆచార్య టికెట్ బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించడం ఖాయంగా కనబడుతుంది. అయితే ఇప్పుడు చిరు కోసం కోసం క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుకుమార్, చిరంజీవిని కలిసి... లూసిఫెర్ స్క్రిప్ట్‌లో వచ్చిన మార్పులపై చర్చించారు. ఆచార్య షూట్ ముగిసిన తర్వాత సుకుమార్ సినిమా ఉండొచ్చు. అలాగే త్రివిక్రంతోను చిరు సినిమా లైన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది.
అయితే ఏ దర్శకుడు తన వద్దకు వచ్చినా.. సమాజానికి ఉపయోగపడే కథలతో రావాలని.. తాను చేసే సినిమాల్లో మెస్సేజ్ ఓరియెంటెడ్ గా ఉండాలని.. చిరు వాళ్ళకి సూచిస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటి వరకు అభిమానుల కోసం చేసిన కమర్షియల్ చిత్రాలు ఒక ఎత్తైతే.. ఇప్పటినుండి చేసే సినిమాలు ఒక ఎత్తులో ఉండాలని.. వాళ్ళకి చెబుతున్నాడట. మరి కొరటాల అలా మెస్సేజ్ ఓరియెంటెడ్ కథతో రావడం.. చిరు కూడా అదే మూడ్ లో ఉండడటంతో.. వాళ్ళ ప్రాజెక్ట్ వెంటనే పట్టాలెక్కినట్లుగా తెలుస్తుంది. మరి సుకుమార్ లూసిఫెర్ రీమేక్ అనుకోండి.. ఇక త్రివిక్రమ్ లాంటోళ్ళు సోషల్ మెస్సేజ్ ఓరియెంటెడ్ కథలను సెలెక్ట్ చేసుకోవాలన్నమాట.