Advertisementt

చెర్రీకి రీమేక్ రెడీ.. ఢీ కొట్టేందుకు రానా!?

Wed 12th Feb 2020 04:51 AM
remake,remake movie,ramcharan,rana daggubati  చెర్రీకి రీమేక్ రెడీ.. ఢీ కొట్టేందుకు రానా!?
Remake Ready To Cherry.. Rana! చెర్రీకి రీమేక్ రెడీ.. ఢీ కొట్టేందుకు రానా!?
Advertisement
Ads by CJ

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌కు రీమేక్ సినిమా రెడీ అయ్యిందని.. అందులో ఆయన్ను ఢీ కొట్టేందుకు రానా దగ్గుబాటిని తీసుకుంటున్నారట. ఇదేదో వినడానికి అటు మెగాభిమానులు.. ఇటు దగ్గబాటి అభిమానులకు వినసొంపుగా ఉంది కదూ.. అదేనండి తమిళ్‌లో బ్లాక్ బస్టర్ హిట్టయిన ‘విక్రమ్‌ వేద’ రీమేక్‌ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. వాస్తవానికి ఇందులో స్టార్ హీరోలైన ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా మాధవన్, గ్యాంగ్‌స్టర్‌గా విజయ్‌ సేతుపతి నటించి మెప్పించారు. సినిమా సూపర్ హిట్టవ్వడంతో పాటు కాసుల వర్షం గట్టిగానే కురిపించింది. నాటి నుంచి ఈ సినిమాను రీమేక్ చేయాలని తెలుగు డైరెక్టర్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సరైన జోడి మాత్రం దొరకట్లేదట.

తాజాగా.. మాధవన్ పాత్రకు చెర్రీ.. సేతుపతి పాత్రకు రానాను తీసుకోవాలని ఓ ప్రముఖ నిర్మాత సంస్థ సన్నాహాలు చేస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఎవరితో తెరకెక్కించాలనే పనిలో డైరెక్టర్ కోసం వెతుకుతున్నారట. అయితే ఇందులో నిజానిజాలెంత అనేది మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే.. అప్పట్లో ఈ రీమేక్‌లో నారా రోహిత్, వెంకటేష్ నటిస్తారని వార్తలు వచ్చాయి. అంతేకాదు కొద్ది రోజుల తర్వాత రవితేజ, కార్తికేయల పేర్లు కూడా వినపడ్డాయి. వీరి పేర్లు అనుకున్నారంతే.. అయితే జోడీ సర్లేదని ఆ ప్రముఖ నిర్మాణ సంస్థ వద్దనుకుందట. అయితే.. ఆర్ఆర్ఆర్ తర్వాత చెర్రీ.. కొన్నిరోజుల తర్వాత రానా ఇద్దరు ఫ్రీ అవుతారని రీమేకే కదా పెద్ద టైమ్ తీసుకోదని వారిద్దర్నీ సదరు నిర్మాణ సంస్థ ఒప్పించిందట. ఇదే నిజమైతే నాడు ప్రభాస్-రానా కాంబోలో లాగా.. ఇప్పుడు చెర్రీ-రానా కాంబోను చూడొచ్చన్న మాట. ఇదే నిజమైతే మాత్రం ఇరువురి ఫ్యాన్స్‌కు పూనకాలే మరి.

Remake Ready To Cherry.. Rana!:

Remake Ready To Cherry.. Rana!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ