Advertisementt

‘ఒరేయ్‌ బుజ్జిగా..’ ఫస్ట్ లుక్‌‌కి సూపర్బ్ రెస్పాన్స్!

Wed 12th Feb 2020 04:45 AM
kk radhamohan,oery bujjigaa,movie,first look,response  ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ ఫస్ట్ లుక్‌‌కి సూపర్బ్ రెస్పాన్స్!
Tremoundes Response to Oery Bujjigaa Movie First Look ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ ఫస్ట్ లుక్‌‌కి సూపర్బ్ రెస్పాన్స్!
Advertisement
Ads by CJ

‘ఒరేయ్‌ బుజ్జిగా..’ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్‌, సమ్మ‌ర్ స్పెష‌ల్‌గా విడుద‌ల‌.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా...’ ఈ చిత్రంలో హీరోయిన్ హెబ్బా ప‌టేల్ ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయనున్నారు. హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాళవిక నాయర్ లతో కూడిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుద‌ల‌ చేసింది చిత్ర యూనిట్.  వేరు వేరు గెట‌ప్స్‌ల‌లో ముగ్గురు రాజ్‌ తరుణ్‌లు, ఇద్దరు మాళవికలు దర్శనమిస్తున్న ఈ ఫొటో నవ్వుల్ని పంచుతుంది. ఓ పక్క మాళవిక క్రికెట్‌ బ్యాట్‌ పట్టుకుని కొట్టేందుకు ప్రయత్నిస్తుంటే రాజ్‌ తరుణ్‌ ఆపుతాడు. మరోవైపు రాజ్‌ తరుణ్ని కింద పడేసి గట్టిగా మెడను పట్టుకుంటుంది మాళవిక. ఆమె నుంచి రాజ్‌ను రక్షించేందుకు మరో రాజ్‌ తరుణ్‌ ప్రయత్నిస్తాడు.  ఓ రహదారిపై జరిగిన సన్నివేశంలో వీళ్లిద్దరి హావభావాలు చూస్తే ఎవ‌రినైనా నవ్వులు పూయాల్సిందే.

ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ - ‘‘ఇటీవ‌ల విడుద‌ల చేసిన మా ‘ఒరేయ్ బుజ్జిగా...’ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. రాజ్‌ తరుణ్‌ కి తగిన యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది.  మా బ్యానర్ లో ‘ఏమైంది ఈ వేళ’, ‘అధినేత’, ‘బెంగాల్ టైగర్’,  ‘పంతం’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ ఇది. రాజ్ తరుణ్, కొండా విజయ్ కుమార్, అనూప్ రూబెన్స్ లకు త‌ప్ప‌కుండా మంచి కమర్షియల్ సినిమా అవుతుంది.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్  ప‌నులు జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి  సమ్మర్ స్పెషల్ గా చిత్రాన్ని విడుదల చేయనున్నాం.” అన్నారు.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబ్బా పటేల్, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.

Tremoundes Response to Oery Bujjigaa Movie First Look:

KK RadhaMohan Talks About Oery Bujjigaa Movie First Look Response

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ