దర్శకుడు తేజ నేనే రాజు నేనే మంత్రి అంటూ రానా హీరోగా తెరకెక్కించిన ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా తర్వాత సీత సినిమా కాన్ఫిడెంట్ తో చేసాడు కానీ ఆ సినిమా దెబ్బేసింది. కాజల్ హీరోగా, బెల్లంకొండ నటించిన సీత సినిమా బాక్సాఫీసుని మెప్పించలేకపోయింది. తర్వాత తేజ కాస్త గ్యాప్ తీసుకుని మళ్ళీ రానా హీరోగా మరో సినిమా స్క్రిప్ట్ సిద్ధం చెయ్యడమే కాదు ఈ సినిమాకి టైటిల్ గా RRR అంటూ పెట్టాడు. మరి రాజమౌళి RRR టైటిల్ లాగా తేజ కుడా రాక్షస రాజు రావణాసురుడుని RRR గా రిజిస్టర్ చేయించాడు.
మరి రానా సినిమా ఇంకా మొదలవ్వకముందే మరో సినిమా టైటిల్ కూడా తేజ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించడంపై అందరిలో ఆసక్తి నెలకొంది. తేజ కెరీర్ తొలినాళ్లలో గోపీచంద్ ని విలన్ గా మార్చి చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం హీరోగా గోపీచంద్ కెరీర్ డోలాయమానంలో ఉంది. సంపత్ నంది డైరెక్షన్ లో సిటిమార్ అంటూ చేస్తున్న గోపిచంద్, తర్వాత తేజ డైరెక్షన్ లో సినిమా చెయ్యబోతున్నాడు. అయితే తేజ ముందు రానాతో RRR తీశాకే.. గోపీచంద్ సినిమా మొదలుపెడతాడు. ప్రస్తుతం కథ రెడీగా ఉన్నా గోపీచంద్ మూవీకి కూడా తేజ టైటిల్ ని సెట్ చేసాడు. అది కూడా వెరైటీగా ఉండేలా అలివేలు – వెంకటరమణ అంటూ సాంప్రదాయక పేరు పెట్టడము, ఆ టైటిల్ లో దేవుడి పేరు కనిపించడం చూస్తే తేజ సెంటిమెంట్ ని నమ్ముకున్నట్టుగా కనబడుతుంది.