Advertisementt

హ్యాట్రిక్ కోసం సంక్రాంతికే ప్లాన్ చేస్తున్నాడు

Wed 12th Feb 2020 12:07 AM
anil ravipudi,venkatesh,varun tej,f3 movie,sankranthi  హ్యాట్రిక్ కోసం సంక్రాంతికే ప్లాన్ చేస్తున్నాడు
Anil Ravipudi Again in Sankrathi Race హ్యాట్రిక్ కోసం సంక్రాంతికే ప్లాన్ చేస్తున్నాడు
Advertisement
Ads by CJ

దర్శకుడు అనిల్ రావిపూడి గత ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా బాక్సాఫీసు వద్ద ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. వెంకటేష్ - వరుణ్ తేజ్ ల కలయికలో మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఎఫ్ 2 అనిల్ ని స్టార్ డైరెక్టర్ చేసింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ దెబ్బకి అనిల్ రావిపూడికి మహేష్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం రావడం మహేష్ తో చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమాని కూడా ఈ సంక్రాంతికి విడుదల చేసిన అనిల్ కి ఆ సినిమా కూడా హిట్ లిస్ట్ లో చేరడంతో సంక్రాంతి హిట్ దర్శకుడు అనిల్ అంటూ సోషల్ మీడియాలో అనిల్ పేరుని మహేష్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేసారు.

రెండు సంక్రాంతులు భారీ హిట్స్ కొట్టిన అనిల్ రావిపూడి ఇప్పుడు మూడో సంక్రాంతి టార్గెట్ గా కొత్త సినిమాని మొదలెట్టబోతున్నాడట. మూడో సంక్రాంతికి కూడా తన సినిమాని విడుదల చేసి సంక్రాంతికి హ్యాట్రిక్ కొట్టాలని అనిల్ డిసైడ్ అయ్యాడని తెలుస్తుంది. అందులో భాగంగానే ఎఫ్ 3 స్క్రిప్ట్ మీద కూర్చున్నట్టుగా చెబుతున్నారు. ఎఫ్ 3 లో వరుణ్ - వెంకటేష్ కాకుండా మరో హీరోని కూడా యాడ్ చేస్తున్నాడట. అయితే ఆ మూడో స్థానంలోకి ఒకరు మహేష్ గెస్ట్ అంటే.. మరొకరు రవితేజ అంటున్నారు.

ఫైనల్ గా రవితేజని ఫిక్స్ అవుతాడేమో తెలియదు కానీ ఈలోపు వెంకటేష్ ఎఫ్ 3 కి పారితోషకం భారీగా డిమాండ్ చేస్తున్నట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో రేజ్ అయ్యింది. మరి ఎఫ్ 3 సెట్స్ మీదకెళ్ళకుండానే అనిల్ ముచ్చటగా మూడో సంక్రాంతికి హిట్ కొట్టాలని అందులోనూ RRR కి ఎదురెళ్లి హిట్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నాడని తెలుస్తుంది. మరి రాజమౌళి RRR సంక్రాంతి ఫేవరేట్ గా ఉన్నప్పటికీ.. వచ్చే సంక్రాంతికి ఏ హీరో ఆగేలా లేడు.

Anil Ravipudi Again in Sankrathi Race:

Anil Ravipudi F3 in Sankranthi Race

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ