Advertisementt

‘ఉప్పెన’ విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ వదిలారు

Tue 11th Feb 2020 08:18 PM
vijay sethupathi,first look,vaisshnav tej,uppena,release  ‘ఉప్పెన’ విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ వదిలారు
Vijay Sethupathi First Look In Vaisshnav Tej’s Uppena Released ‘ఉప్పెన’ విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ వదిలారు
Advertisement
Ads by CJ

వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ విడుదల

వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ‘ఉప్పెన’ చిత్రంలో పాపులర్ తమిళ నటుడు విజయ్ సేతుపతి ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్రంలో ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోమవారం విడుదల చేశారు. అంబాసడర్ కారుకు ఆనుకొని నిల్చొని, మెలి తిప్పిన మీసాలతో, తీక్షణమైన చూపులతో విజయ్ సేతుపతి కనిపిస్తున్నారు. పోస్టర్ ప్రకారం ఆయన నడివయసు వ్యక్తిలా ఉన్నారు. బ్యాగ్రౌండ్ లో సముద్రం కనిపిస్తోంది.  

మరో పోస్టర్లో సిగరెట్ తాగుతూ దీర్ఘాలోచనలో ఉన్న విజయ్ సేతుపతి కనిపిస్తున్నారు. లెజెండరీ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసోసియేట్ గా పనిచేసిన బుచ్చిబాబు సానా.. ‘ఉప్పెన’తో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ద్వారా కృతి శెట్టి నాయికగా టాలీవుడ్ లో అడుగుపెడుతోంది.

‘రాక్ స్టార్’ దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, శాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ‘ఉప్పెన’ను నిర్మిస్తోంది.

తారాగణం: పంజా విష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, కృతి శెట్టి, సాయిచంద్, బ్రహ్మాజీ

సాంకేతిక వర్గం:

కథ, దర్శకత్వం: బుచ్చిబాబు సానా

నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అనిల్ వై., అశోక్ బి.

సీఈవో: చెర్రీ

సినిమాటోగ్రఫీ: శాందత్ సైనుద్దీన్

మ్యూజిక్ డైరెక్టర్: దేవి శ్రీప్రసాద్

ఎడిటర్: నవీన్ నూలి

ఆర్ట్ డైరెక్టర్: మౌనిక రామకృష్ణ

పీఆర్వో: వంశీ-శేఖర్, మధు మడూరి

బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్

విడుదల తేదీ: 2 ఏప్రిల్ 2020

Vijay Sethupathi First Look In Vaisshnav Tej’s Uppena Released:

Uppena Movie Vijay Sethupathi Look Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ